Telugu Global
NEWS

ప్రకటనలతో ముంచెత్తుతున్న కూటమి.... టీఆర్‌ఎస్‌కు ఏమైంది?

తెలంగాణ ఎన్నికల వేళ మీడియా పాత్ర చాలా కీలకంగా మారింది. టీడీపీతో పొత్తు తర్వాత కాంగ్రెస్‌ కూటమికి మీడియా నుంచి భారీ మద్దతు వస్తోంది. తెలంగాణలో కూటమి గెలవడం అంటే టీడీపీ మళ్లీ గెలవడమే అని భావిస్తున్న మీడియా రంగంలోకి దిగి కూటమి ప్రచారాన్ని భుజానేసుకుంది. ఇదే సమయంలో గత వారం రోజులుగా కాంగ్రెస్‌-టీడీపీ కూటమి ప్రకటనలతో ప్రతికలను ముంచెత్తుతున్నారు. ప్రధాన తెలుగు పత్రికల్లో ఫుల్‌ పేజ్‌ యాడ్స్‌ను కూటమి ఇస్తోంది. చంద్రబాబు, రాహుల్‌ ఇద్దరి ఫొటోలతో, […]

ప్రకటనలతో ముంచెత్తుతున్న కూటమి.... టీఆర్‌ఎస్‌కు ఏమైంది?
X

తెలంగాణ ఎన్నికల వేళ మీడియా పాత్ర చాలా కీలకంగా మారింది. టీడీపీతో పొత్తు తర్వాత కాంగ్రెస్‌ కూటమికి మీడియా నుంచి భారీ మద్దతు వస్తోంది. తెలంగాణలో కూటమి గెలవడం అంటే టీడీపీ మళ్లీ గెలవడమే అని భావిస్తున్న మీడియా రంగంలోకి దిగి కూటమి ప్రచారాన్ని భుజానేసుకుంది.

ఇదే సమయంలో గత వారం రోజులుగా కాంగ్రెస్‌-టీడీపీ కూటమి ప్రకటనలతో ప్రతికలను ముంచెత్తుతున్నారు. ప్రధాన తెలుగు పత్రికల్లో ఫుల్‌ పేజ్‌ యాడ్స్‌ను కూటమి ఇస్తోంది.

చంద్రబాబు, రాహుల్‌ ఇద్దరి ఫొటోలతో, కాంగ్రెస్‌- టీడీపీ జెండాలతో ఏమాత్రం సంశయం లేకుండా ప్రతి పత్రికలోనూ రెండు ఫుల్‌ పేజ్‌ యాడ్స్‌ను ఇస్తున్నారు. ప్రకటనలు మొదలైన తొలిరోజుల్లో ఎన్టీఆర్‌ బొమ్మను వాడి, వైఎస్‌ బొమ్మను మాత్రం ప్రకటనల్లో వాడలేదు. దీనిపై విమర్శలు రావడంతో ఆ తర్వాత ఎన్టీఆర్‌ బొమ్మ కూడా లేకుండా ప్రకటనలు ఇస్తున్నారు.

మహాకూటమి ఇలా ప్రకటనలతో పత్రికల్లో రెచ్చిపోతోంది. అయితే ఇప్పటి వరకు అధికార టీఆర్‌ఎస్‌ నుంచి పత్రికల్లో ఫుల్ పేజ్‌ యాడ్స్ కనిపించడం లేదు. రోజూ ఉదయమే ఏ పత్రిక చూసినా రాహుల్‌ గాంధీ-చంద్రబాబు ముఖాలతో మహాకూటమి ప్రకటనలే దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీడియా మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన టీడీపీ… ప్రజల్లో మహాకూటమి ప్రభావం తీవ్రంగా ఉండబోతుందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు చాలా ముందు చూపులతోనే పత్రికల్లో తొలిపేజీ, ఆఖరి పేజీల ప్రకటనల కోసం బుక్‌ చేసుకున్నట్టు చెబుతున్నారు. చంద్రబాబు రూపంలో ఆర్ధికంగా కొండంత అండ దొరకడంతో పత్రికల్లో భారీ ప్రకటనలకు అవుతున్న కోట్లాదిరూపాయల ఖర్చు గురించి కాంగ్రెస్ ఏమాత్రం ఆలోచించడం లేదు. ప్రకటనల ఖర్చు చంద్రబాబే భరిస్తున్నారని చెబుతున్నారు.

చంద్రబాబు నుంచి ఆర్ధిక ఆసరా దొరకడంతో మహాకూటమి వారం రోజులుగా నిత్యం ప్రతికల్లో భారీ ప్రకటనలు ఇస్తోందని… వీరు ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఉండదని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. పత్రికలు తన చేతిలో ఉండడంతో చంద్రబాబు భారీ ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని… టీఆర్‌ఎస్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోందో దాన్ని ఎన్నికల ఆఖరి రోజుల్లో చెబుతామంటున్నారు.

మొత్తం మీద చూస్తే పత్రికలు, టీవీ చానళ్లలో ప్రకటనల హోరులో మహాకూటమి టీఆర్‌ఎస్‌ కంటే చాలా దూకుడుగా ఉందనే చెప్పాలి. టీఆర్‌ఎస్‌ కూడా ప్రకటనలు ఇస్తున్నా అవి మహాకూటమి తరహాలో భారీగా లేవు. స్వతహాగా టీడీపీకి అభిమానులైన పత్రికలు, టీవీచానళ్లు ఉండడం కూడా మహాకూటమి భారీ ప్రచారానికి అనుకూలంగా మారింది.

First Published:  2 Dec 2018 5:39 AM IST
Next Story