Telugu Global
NEWS

చంద్రబాబు ఉచ్చులో పడకూడదనే....

ఇక ప్రచారానికి మిగిలింది నాలుగు రోజులే.. వస్తాడు.. తమ్ముడు ప్రచారం చేస్తాడని ఎంతో ఊహించిన నందమూరి సుహాసిని ఆశలు గల్లంతవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రావట్లేదు.. కనీసం నందమూరి కళ్యాణ్ రామ్ అయినా వస్తాడని కలలు గంటే పెద్ద తమ్ముడూ రావట్లేదని వార్తలొస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెరపడనున్న వేళ.. నందమూరి సుహాసిని తమ్ముళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్క తరుఫున ఇంకా కుకట్ పల్లిలో ప్రచారం చేయకపోవడానికి కారణమేంటనే ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో […]

చంద్రబాబు ఉచ్చులో పడకూడదనే....
X

ఇక ప్రచారానికి మిగిలింది నాలుగు రోజులే.. వస్తాడు.. తమ్ముడు ప్రచారం చేస్తాడని ఎంతో ఊహించిన నందమూరి సుహాసిని ఆశలు గల్లంతవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రావట్లేదు.. కనీసం నందమూరి కళ్యాణ్ రామ్ అయినా వస్తాడని కలలు గంటే పెద్ద తమ్ముడూ రావట్లేదని వార్తలొస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెరపడనున్న వేళ.. నందమూరి సుహాసిని తమ్ముళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్క తరుఫున ఇంకా కుకట్ పల్లిలో ప్రచారం చేయకపోవడానికి కారణమేంటనే ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ఎన్నికల బరిలో ఊహించని అభ్యర్థిత్వంతో అందరినీ తమ వైపు చూసేలా చేసింది టీడీపీ. నందమూరి సుహాసిని పేరును అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చింది. నందమూరి ఎన్టీఆర్ మూడో తరం వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం.. నందమూరి ఆడపడుచు ఎన్నికల బరిలోకి దిగడం.. అది తెలంగాణలో కావడంతో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. కానీ ఆ ఆసక్తి ఇప్పుడు ఉత్కంఠగా, టెన్షన్ గా, తెలంగాణ గట్టు మీద టీడీపీ పరువు, ప్రతిష్టలకు సవాల్‌ గా మారిపోయింది.

నిజానికి చంద్రబాబు ఈ ఎత్తు వేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. చనిపోయిన హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని చూడడం బాగానే ఉన్నా వారిని తెలంగాణ బరిలో నిలిపి బలిపశువును చేశారనే చెప్పాలి. ఏపీ నుంచి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇస్తే సరిపోయేది. కానీ సెంటిమెంట్ ను వాడుకొని తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టాలనే బాబు సుహాసినిని కూకట్ పల్లిలో దించారని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

నందమూరి ఫ్యామిలీకి ఏమాత్రం ఆసక్తి లేకున్నా చంద్రబాబు-బాలయ్య కలిసి కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసినిని బరిలో దించేశారు. అక్క బరిలో ఉండగానే ఆమె విజయాన్ని కాంక్షిస్తూ తమ్ముళ్లు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఓ ప్రకటనలో మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ప్రచారం పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. సుహాసినికి మద్దతుగా చంద్రబాబు, బాలయ్య రోడ్ షోలు నిర్వహిస్తూ కూకట్ పల్లిలో హోరెత్తిస్తున్నారు. కానీ ప్రచారానికి వస్తారని ఆశించిన సొంత తమ్ముళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి స్టార్ హీరో ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

హరికృష్ణ ఫ్యామిలీ ఆది నుంచి టీఆర్ఎస్ తో మంచి సంబంధాలు కలిగి ఉంది. హరికృష్ణ చనిపోయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది. అంతేకాదు కేసీఆర్ స్వయంగా వచ్చి హరికృష్ణ స్మారకస్తూపానికి 400 గజాల స్థలం ఇచ్చారు. ఆ కృతజ్ఞతతోనే ఎన్టీఆర్ ఇప్పుడు ప్రచారానికి దూరంగా జరిగారట.. అంతేకాదు.. ఇటీవల కేటీఆర్ కూకట్ పల్లి రోడ్ షోలో ఓ హాట్ కామెంట్ చేశారు. సుహాసినిని చంద్రబాబు బరిలో దించి ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రాకుండా చేశారని.. సుహాసినిని కూడా బలి పశువును చేశాడని ఆరోపించారు. దీంతో అక్క తరుఫున ప్రచారం చేస్తే టీఆర్ఎస్ నే తిట్టాలి. ఒకవేళ తేడా వస్తే ఎన్నికల తర్వాత తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని.. అనవసరంగా గులాబీ దండుతో పెట్టుకోవద్దనే ఎన్టీఆర్ అక్క సుహాసిని తరుఫున ప్రచారానికి రావడం లేదని సమాచారం. ఇలా ఓ వైపు టీఆర్ఎస్, బాబు ఎత్తులు, పై ఎత్తులు మధ్య తన ఇమేజ్ దృష్ట్యానే ఎన్టీఆర్ అక్క తరుఫున ప్రచారానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  2 Dec 2018 12:00 AM GMT
Next Story