Telugu Global
Cinema & Entertainment

చైనాకు వెళ్లబోతున్న చిట్టి

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గ్రాఫిక్ వండర్ 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ చైనాలో మాత్రం ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అన్ని దేశాల్లో విడుదల చేసినట్టు చైనాలో నేరుగా ఇండియన్ సినిమాను విడుదల చేయడానికి వీల్లేదు. భారతీయ చిత్రాలకు అక్కడ కోటా పద్ధతి ఉంటుంది. అలా కోటా పద్ధతి కింద దరఖాస్తు చేసుకుంటే.. 2.0ను ఫిబ్రవరిలో చైనాలో ప్రదర్శించుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇండియాతో పోలిస్తే చైనాలో సెల్ ఫోన్ […]

చైనాకు వెళ్లబోతున్న చిట్టి
X

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గ్రాఫిక్ వండర్ 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ చైనాలో మాత్రం ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అన్ని దేశాల్లో విడుదల చేసినట్టు చైనాలో నేరుగా ఇండియన్ సినిమాను విడుదల చేయడానికి వీల్లేదు. భారతీయ చిత్రాలకు అక్కడ కోటా పద్ధతి ఉంటుంది. అలా కోటా పద్ధతి కింద దరఖాస్తు చేసుకుంటే.. 2.0ను ఫిబ్రవరిలో చైనాలో ప్రదర్శించుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇండియాతో పోలిస్తే చైనాలో సెల్ ఫోన్ వినియోగం, ఉత్పత్తి 8 రెట్లు ఎక్కువ. చైనా జనాభాలో దాదాపు 88 శాతం మంది ప్రజలకు సెల్ ఫోన్లు ఉన్నాయి. సో.. సెల్ ఫోన్ వినియోగం అనే కాన్సెప్ట్ పై తెరకెక్కిన ఈ సినిమా చైనా ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. చైనా వెర్షన్ లోకి 2.0ను మార్చే ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయింది.

క్లైమాక్స్ లో వచ్చే పాటను తొలిగించడంతో పాటు.. ప్రీ-క్లైమాక్స్ లో వచ్చే ‘రాండాలి’ అనే పాటను కూడా తొలిగించబోతున్నారు. దీంతో పాటు అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లకు చెందిన కొన్ని పోర్షన్లను కుదించబోతున్నారు. మొత్తంగా 1 గంట 45 నిమిషాల నిడివితో 2.0 మండరిన్ వెర్షన్ ను సిద్ధం చేస్తున్నారు.

First Published:  2 Dec 2018 2:55 PM IST
Next Story