ప్రభాస్ సినిమాని దక్కించుకున్న విజయ్ దేవరకొండ
“బాహుబలి” సినిమాతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏ రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ కి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం వచ్చిన ఏ ఒక్క ఆఫర్ ని కూడా ఓకే చెయ్యకుండా తెలుగు సినిమాలు సైన్ చేసాడు. ఇక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ అయితే ప్రభాస్ కి భారీ పారితోషకం ఆఫర్ చేసి […]
“బాహుబలి” సినిమాతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏ రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ కి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం వచ్చిన ఏ ఒక్క ఆఫర్ ని కూడా ఓకే చెయ్యకుండా తెలుగు సినిమాలు సైన్ చేసాడు.
ఇక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ అయితే ప్రభాస్ కి భారీ పారితోషకం ఆఫర్ చేసి ఒక సినిమా చేయమని చెప్పాడు, ప్రభాస్ కరణ్ జోహార్ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసాడు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి హీరోగా విజయ్ దేవరకొండని సెలెక్ట్ చేసాడు కరణ్ జోహార్. ఇటివలే విజయ్ దేవరకొండ కి నార్త్ లో ఉన్న క్రేజ్ ని గమనించిన కరణ్ జోహార్ ఈ ఆఫర్ ని విజయ్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది.
అలాగే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా విజయ్ దేవరకొండ అభిమాని అని చెప్పుకొచ్చింది. కరణ్ జోహార్ కూడా విజయ్ దేవరకొండని, జాన్వి కపూర్ ని హీరో హీరోయిన్లు గా పెట్టి ఈ సినిమా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. మొత్తానికి ప్రభాస్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం తిరిగి విజయ్ దేవరకొండ వద్దకు వచ్చి ఆగింది.