Telugu Global
NEWS

రేవంత్‌ కు ఓటమి భయం పట్టుకుందా?

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ పరిస్థితి ఏంటి? ఓటమి ఖాయమా? రేవంత్ ను ఇంతలా దిగజార్చిన అంశాలేంటి? వీటన్నింటిని తెలుసుకునేందుకు కాంగ్రెస్ తోపాటు, టీడీపీలకు చెందిన కొందరు నాయకులు కొడంగల్లో సర్వే చేయించారట. ఈ సర్వేతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయ్యిందట. రేవంత్ ఓటమి ఖాయం అని తెలిసిందట. ఏం చేస్తే గెలుస్తామనే సమాచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. […]

రేవంత్‌ కు ఓటమి భయం పట్టుకుందా?
X

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ పరిస్థితి ఏంటి? ఓటమి ఖాయమా? రేవంత్ ను ఇంతలా దిగజార్చిన అంశాలేంటి? వీటన్నింటిని తెలుసుకునేందుకు కాంగ్రెస్ తోపాటు, టీడీపీలకు చెందిన కొందరు నాయకులు కొడంగల్లో సర్వే చేయించారట. ఈ సర్వేతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయ్యిందట. రేవంత్ ఓటమి ఖాయం అని తెలిసిందట. ఏం చేస్తే గెలుస్తామనే సమాచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

అధికార టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు బాధ్యతలను సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. ఈ సమయంలోనే రేవంత్ కు మద్దతుగా ఉండాల్సిన కొందరు టీడీపీ నేతలు…ఈ పార్టీ విధానాలు నచ్చక గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాల్నింటినీ పరిశీలిస్తే…రేవంత్ కథ సగం ముగిసినట్లేనని అంటున్నారు.

అయితే ఓటమి తప్పదని రేవంత్ రెడ్డికి ఎన్నికల షెడ్యూల్ రీలీజ్ అయ్యే రోజుకే తెలుసని సమాచారం. చంద్రబాబు చేయించిన సర్వేతో రేవంత్ రెడ్డికి దిమ్మతిరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిపై మహాకూటమిలో పెద్ద డిస్కషన్ జరిగిందట. దీంతో దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి…సీఎం కేసీఆర్ పై మాటల యుద్ధానికి దిగాడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చినా….ఏం లాభం లేదని రేవంత్ కు అర్థమైందట.

ఈ క్రమంలోనే మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోవడం, కేటీఆర్ , హరీశ్ రావులు కొడంగల్లోనే పాగా వేయడంతో….అక్కడ సీన్ పూర్తిగా మారిపోయిందట. ఓటుకు నోటు కేసు … నోటి దురుసు, అక్రమాస్తులు… ఇవన్నీ అధికార పార్టీకి కలిసివచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డిని గెలిపించాలని….ఎంత ఖర్చు అయినా చేసేందుకు రెడీయైనా… ఫలితం లేకుండా పోయిందట. రేవంత్ కు ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చారట చంద్రబాబు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ దూకుడును చూసి ఖంగుతిన్న రేవంత్, రాహుల్ తో సభ పెట్టించుకున్నారట.

ఇప్పుడు రేవంత్ రెడ్డి సడెన్ గా రూట్ మార్చారు. కాంగ్రెస్ పార్టీ కేటాయించిన హెలికాప్టర్లలోనే నియోజక వర్గాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్న రేవంత్….తనపై హత్యాయత్నం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తనకు సరైన రక్షణ కల్పించడంలేదని వాపోయారు.

తెలంగాణ అంతటా ఫుల్ జోష్ లో ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డికి… తగినంత భద్రత లేదన్న వాదన ఎందుకు వచ్చిందనే అనుమానాలు మొదలయ్యాయి. దీనంతటికి కారణం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్లో మంత్రి హరీశ్ రావు చేపట్టిన ర్యాలీ అని అంటున్నారు. రాహుల్ గాంధీ సభకు వచ్చిన జనం కంటే…హరీశ్ చేపట్టిన ర్యాలీలో ఎక్కువ జనం పాల్గొనడం… రేవంత్ రెడ్డి వర్గాల్లో కలకలం రేపుతోందట.

అధికార పార్టీ టీఆరెస్ ను ఓడించాలన్ని టార్గెట్ రేవంత్ పెట్టుకోవడం తప్పుకాదు. కానీ అందుకు తగినట్లుగా వ్యూహా ప్రతివ్యూహాలు రెడీ చేసుకుని ముందుకుసాగినా పర్లేదు. కానీ చంద్రబాబు ఆడించినట్లు రేవంత్ ఆడటం…. తనను చంపుతారంటూ చిల్లర వ్యాఖ్యలు చేయడం…. ఈ పరిస్థితులన్నింటిని కొడంగల్ ప్రజలు గమనిస్తుంటారు. మరి…హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న రేవంత్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదేమో? అని నియోజక వర్గ ప్రజలు అంటున్నారు.

First Published:  1 Dec 2018 6:09 AM IST
Next Story