పెళ్లికి సిద్ధమైన రాఖీసావంత్
బాలీవుడ్ ఐటెంక్వీన్, వివాదాస్పద నటి రాఖీసావంత్ పెళ్లి చేసుకోబోతోంది. ఇదేదే రాఖీ సావంత్ స్వయంవర్ కార్యక్రమం కాదు. 40 ఏళ్ల వయసులో నిజంగానే ఆమె పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించింది. ట్విట్టర్ లో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు పెడుతూ, అందరితో తిట్లు తినే దీపక్ కలాల్ ను రాఖీ సావంత్ పెళ్లాడబోతోంది. డిసెంబర్ 31 సాయంత్రం 5 గంటలకు లాస్ ఏంజెల్స్ లో తమ వివాహం జరుగుతుందని స్వయంగా కలాల్ ప్రకటించాడు. ఈ […]
BY admin1 Dec 2018 4:11 AM IST
X
admin Updated On: 1 Dec 2018 4:11 AM IST
బాలీవుడ్ ఐటెంక్వీన్, వివాదాస్పద నటి రాఖీసావంత్ పెళ్లి చేసుకోబోతోంది. ఇదేదే రాఖీ సావంత్ స్వయంవర్ కార్యక్రమం కాదు. 40 ఏళ్ల వయసులో నిజంగానే ఆమె పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించింది. ట్విట్టర్ లో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు పెడుతూ, అందరితో తిట్లు తినే దీపక్ కలాల్ ను రాఖీ సావంత్ పెళ్లాడబోతోంది.
డిసెంబర్ 31 సాయంత్రం 5 గంటలకు లాస్ ఏంజెల్స్ లో తమ వివాహం జరుగుతుందని స్వయంగా కలాల్ ప్రకటించాడు. ఈ మేరకు ఓ వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీళ్ల పెళ్లి ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికి ముందు ఇద్దరూ కన్యత్వ పరీక్షలు కూడా చేయించుకున్నారట. తాను వర్జిన్ అని డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వడంతో ఆశ్చర్యపోయానంటోంది రాఖీ సావంత్. అలా జరగడానికి వీల్లేదని వాదిస్తోంది.
తమ పెళ్లికి షారూక్ ఖాన్, కరణ్ జోహార్ హాజరవుతారని అంటోంది రాఖీ సావంత్. పెళ్లి వేడుకతో పాటు న్యూ ఇయర్ సంబరాల్ని అమెరికాలో జరుపుకొని ఇండియా తిరిగొస్తామని, ముంబయిలో భారీ రిసెప్షన్ ఉంటుందని ప్రకటించింది రాఖీ సావంత్.
Next Story