Telugu Global
NEWS

భారత మహిళా క్రికెట్ కోచ్ రమేశ్ పొవార్ కు ఉద్వాసన?

మిథాలీ వివాదంతో పదవీకాలం పొడిగింపు లేనట్లే? బీసీసీఐతో నవంబర్ వరకూ రమేశ్ పొవార్ కాంట్రాక్టు భారత మహిళా క్రికెట్లో …కోచ్ ల ఊచకోతల పర్వం కొనసాగుతోంది. సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ వివాదంతో చిక్కుల్లో పడిన ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ సైతం… కాంట్రాక్టు పూర్తికాలం ముగియకముందే… పదవికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత మహిళా క్రికెట్ తొలి పురుష కోచ్ తుషార్ ఆరోతీ… టీ-20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో విభేదాల కారణంగా పదవి పోగొట్టుకొంటే…. […]

భారత మహిళా క్రికెట్ కోచ్ రమేశ్ పొవార్ కు ఉద్వాసన?
X
  • మిథాలీ వివాదంతో పదవీకాలం పొడిగింపు లేనట్లే?
  • బీసీసీఐతో నవంబర్ వరకూ రమేశ్ పొవార్ కాంట్రాక్టు

భారత మహిళా క్రికెట్లో …కోచ్ ల ఊచకోతల పర్వం కొనసాగుతోంది. సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ వివాదంతో చిక్కుల్లో పడిన ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ సైతం… కాంట్రాక్టు పూర్తికాలం ముగియకముందే… పదవికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత మహిళా క్రికెట్ తొలి పురుష కోచ్ తుషార్ ఆరోతీ… టీ-20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో విభేదాల కారణంగా పదవి పోగొట్టుకొంటే…. తాజాగా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ తో వివాదం కారణంగా…. ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ పదవికి దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్లో…ఇంగ్లండ్ తో పోటీకి దిగిన భారతజట్టులో చోటు లేని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్… కోచ్ రమేశ్ పొవార్ పై తీవ్రఆరోపణలు చేసింది.

రమేశ్ పొవార్ తనపట్ల వివక్ష చూపారని…తన కెరియర్ అంతం చేయటానికి కుట్రపన్నారంటూ మిథాలీ ఆరోపిస్తే…. మిథాలీ ఓ బ్లాక్ మెయిలర్ అంటూ…. పొవార్ బోర్డుకు సమర్పించిన తన నివేదికలో సమర్ధించుకొన్నారు.

మరోవైపు…. కోచ్ గా రమేశ్ పొవార్ పనితీరు అద్భుతంగా ఉందని…. తమజట్టు సభ్యుల మైండ్ సెట్ నే మార్చివేశారని..కెప్టెన్ హ్మరన్ ప్రీత్ కౌర్, జట్టులోని ఇతర సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.

వాస్తవానికి…. భారత మహిళా క్రికెట్ శిక్షకునిగా …. రమేశ్ పొవార్ కాంట్రాక్టు నవంబర్ తో ముగియనుంది.

First Published:  1 Dec 2018 3:25 AM IST
Next Story