టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ షాక్
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కూకట్‌పల్లిలో తన సోదరి సుహాసిని తరపునైనా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహిస్తారని భావించారు. కానీ కూకట్‌పల్లిలో కూడా ప్రచారం చేయకూడదని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. సుహాసినికి మద్దతు పలకాలని ప్రజలను కోరుతూ ఇది వరకే ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అంతకు మించి ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. కూకట్‌పల్లిలో పరిస్థితులు టఫ్‌గా ఉండడంతో […]
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
కూకట్‌పల్లిలో తన సోదరి సుహాసిని తరపునైనా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహిస్తారని భావించారు. కానీ కూకట్‌పల్లిలో కూడా ప్రచారం చేయకూడదని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు.
సుహాసినికి మద్దతు పలకాలని ప్రజలను కోరుతూ ఇది వరకే ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అంతకు మించి ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు.
కూకట్‌పల్లిలో పరిస్థితులు టఫ్‌గా ఉండడంతో ఇప్పటికే పలువురు కీలక నేతలను టీడీపీ రంగంలోకి దింపింది. సోదరి సెంటిమెంట్‌తో జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా ప్రచారానికి రప్పించాలని భావించారు. కానీ వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.
నందమూరి ఫ్యామిలీని, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ను దెబ్బతీసేందుకే కూకట్‌పల్లిలో హరికృష్ణ కుమార్తె సుహాసినికి చంద్రబాబు టికెట్ ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది.