అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్) చనిపోయారు. ఈయన అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ సీనియర్ బుష్ కుమారుడే జూనియర్ జార్జ్ బుష్. ఇతడు కూడా అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. జూనియర్ బుష్ హయాంలోనే అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడులు చేశారు. తండ్రీ, కుమారుడు ఇద్దరూ యుద్ధ ప్రియులే. సీనియర్ […]
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్) చనిపోయారు. ఈయన అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ చనిపోయారు.
ఈ సీనియర్ బుష్ కుమారుడే జూనియర్ జార్జ్ బుష్. ఇతడు కూడా అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. జూనియర్ బుష్ హయాంలోనే అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడులు చేశారు. తండ్రీ, కుమారుడు ఇద్దరూ యుద్ధ ప్రియులే.
సీనియర్ బుష్ 1989 నుంచి 1993 వరకు అమెరికా అధ్యక్షుడిగా సేవలందించారు. తన తండ్రి చనిపోయిన వార్తను అందరికీ తెలియజేయడానికి తాను చాలా చింతిస్తున్నట్లు బుష్ కుమారుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన తండ్రి మరణంతో ఒక ఫిలాసఫర్, ఒక మార్గదర్శిని కోల్పోయానని జూనియర్ బుష్ వ్యాఖ్యానించారు.