కలెక్టర్ కాటంనేని భాస్కర్ కు జైలు శిక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న, సుధీర్ఘ కాలంగా బదిలీ లేకుండా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గానే కొనసాగుతున్న కాటంనేని భాస్కర్‌కు ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల వివాదంలో హైకోర్టు జైలు శిక్ష విధించింది. నెల రోజుల జైలు, రెండు వేల రూపాయల జరిమానాను విధించింది. గతంలో తామిచ్చిన ఆదేశాలను లెక్కచేయలేదని అభిప్రాయపడ్డ కోర్టు ఈ శిక్ష వేసింది. జిల్లా ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎస్.వి.శేషగిరి రావు, మరో ఐదుగురుకి జూనియర్ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్ వచ్చింది. […]
ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న, సుధీర్ఘ కాలంగా బదిలీ లేకుండా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గానే కొనసాగుతున్న కాటంనేని భాస్కర్‌కు ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల వివాదంలో హైకోర్టు జైలు శిక్ష విధించింది. నెల రోజుల జైలు, రెండు వేల రూపాయల జరిమానాను విధించింది. గతంలో తామిచ్చిన ఆదేశాలను లెక్కచేయలేదని అభిప్రాయపడ్డ కోర్టు ఈ శిక్ష వేసింది.
జిల్లా ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎస్.వి.శేషగిరి రావు, మరో ఐదుగురుకి జూనియర్ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్ వచ్చింది. ఆ హోదాలో జీతాలు అందుకుంటున్నారు. అయితే వీరిని నిబంధనలకు విరుద్దంగా పర్మినెంట్ చేసి… ప్రమోషన్ ఇచ్చారంటూ వారికి ఇస్తున్న జీతాలను కలెక్టర్ ఆపేశారు. దాంతో 2015లో ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.
పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. కానీ సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలపై ఎలాంటి స్టే ఇవ్వలేదు. అయినా సరే హైకోర్టు తీర్పు మేరకు జీతాలు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద జిల్లా ఎస్సీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చైర్మన్ హోదాలో ఉన్న కలెక్టర్ కాటంనేనికి జైలు శిక్ష విధించింది కోర్టు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోయినా తమ ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారని హైకోర్టు కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.