Telugu Global
NEWS

ఏపీలో గన్‌మెన్ల మొబైల్స్‌ పై ఆంక్షలు... ఉల్లంఘిస్తే కఠిన చర్యలే

ఏపీలో ప్రజాప్రతినిధుల గన్‌మెన్లకు కొత్త నిబంధనలను విధించింది ప్రభుత్వం. గన్‌మెన్లు స్మార్ట్‌ఫోన్లు వాడకుండా నిషేధం విధించింది. ఈమేరకు ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. గన్‌మెన్లు డ్యూటీలో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్లు వాడడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సాధారణ ఫోన్లను మాత్రమే వాడేందుకు అనుమతిచ్చారు. ఎవరైనా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. స్మార్ట్‌ఫోన్ల వల్ల విధులపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న కారణంతో పాటు… వీఐపీలను కలిసేందుకు వస్తున్న […]

ఏపీలో గన్‌మెన్ల మొబైల్స్‌ పై ఆంక్షలు... ఉల్లంఘిస్తే కఠిన చర్యలే
X

ఏపీలో ప్రజాప్రతినిధుల గన్‌మెన్లకు కొత్త నిబంధనలను విధించింది ప్రభుత్వం. గన్‌మెన్లు స్మార్ట్‌ఫోన్లు వాడకుండా నిషేధం విధించింది. ఈమేరకు ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. గన్‌మెన్లు డ్యూటీలో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్లు వాడడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు.

అత్యవసర పరిస్థితుల్లో సాధారణ ఫోన్లను మాత్రమే వాడేందుకు అనుమతిచ్చారు. ఎవరైనా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

స్మార్ట్‌ఫోన్ల వల్ల విధులపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న కారణంతో పాటు… వీఐపీలను కలిసేందుకు వస్తున్న వారి దృశ్యాలు రికార్డు చేయడం, ఆడియో, వీడియో రికార్డులకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.

First Published:  1 Dec 2018 4:26 AM IST
Next Story