టీఆర్ఎస్ మేనిఫెస్టోలో బ్రహ్మస్త్రం ఇదేనట
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రచారానికి ఇంకా ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించేశాయి. టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఏ విషయం చెప్పలేదు. త్వరలో టీఆర్ఎస్ ప్రకటించబోయే మేనిఫెస్టోలో మహా కూటమి, బీజేపీ నేతలు అదిరిపోయేలా పథకాలు ఉండబోతున్నాయని సమాచారం. ప్రత్యర్థులకు కేసీఆర్ అదిరిపోయే షాక్ ఇవ్వబోతున్నారు. అదీ టీఆర్ఎస్ మేనిఫెస్టో రూపంలో…. రేపో మాపో ప్రకటించబోతున్న మేనిఫెస్టోను జనరంజకంగా రూపొందిస్తున్నారట. ముఖ్యంగా రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు వినికిడి. […]
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రచారానికి ఇంకా ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించేశాయి. టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఏ విషయం చెప్పలేదు. త్వరలో టీఆర్ఎస్ ప్రకటించబోయే మేనిఫెస్టోలో మహా కూటమి, బీజేపీ నేతలు అదిరిపోయేలా పథకాలు ఉండబోతున్నాయని సమాచారం.
ప్రత్యర్థులకు కేసీఆర్ అదిరిపోయే షాక్ ఇవ్వబోతున్నారు. అదీ టీఆర్ఎస్ మేనిఫెస్టో రూపంలో…. రేపో మాపో ప్రకటించబోతున్న మేనిఫెస్టోను జనరంజకంగా రూపొందిస్తున్నారట. ముఖ్యంగా రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు వినికిడి.
ముఖ్యంగా రైతులను ఆకర్షించేందుకు ఓ పథకాన్ని రూపొందిస్తున్నారట. వ్యవసాయం మొత్తం ప్రభుత్వం అందించే గింజలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతోనే నిర్వహించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నాట. అంటే.. సాగు మొత్తం ప్రభుత్వ నిధులతోనే అన్నమాట. ఈ ప్రతిష్టాత్మక పథకం ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్ల వాన కురిపిస్తుందని టీఆర్ఎస్ నేతలు విశ్వాసంగా ఉన్నారట.
అయితే ఈరోజు బయటకు పొక్కిన ఈ వార్తను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు అంతుపట్టలేనివిగా ఉండటం, మేనిఫెస్టోలోని అంశాలను విమర్శించేందుకు పెద్దగా సమయం లేకుండా కేసీఆర్ ఎన్నికలకు ముందు ఈ మేనిఫెస్టో రీలీజ్ చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించే వరకు వేచి ఉన్నారు. ఆ తరువాత ఇప్పుడు ప్రకటన చేయబోవడం మహా కూటమి అభ్యర్థుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉంది. చూద్దాం…. మరి కేసీఆర్ విసిరిన ఈ బ్రాహ్మస్త్రం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో.