Telugu Global
NEWS

లోకేష్ ను మరింత బదనాం చేస్తున్న అధ్యయనం!

ప్రపంచంలో అత్యంత ప్రభావ శీల నేతలు, వ్యక్తులు అంటూ వివిధ అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఫలితాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఎవరు పవర్ లో ఉంటే అలాంటి వాళ్లను ప్రభావ శీల వ్యక్తులుగా చెబుతూ ఉంటాయి వివిధ సంస్థలు. రాజీవ్‌ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచంలోని అత్యంత అందగత్తెల్లో ఒకరుగా సోనియాను ఎంపిక చేసిందో సంస్థ. ఇలాంటి నేపథ్యంలో…. తాజగా ఒక తలాతోక లేని సంస్థ ఏపీ మంత్రి నారా లోకేష్ ను దేశంలోనేఅత్యంత ప్రభావ శీల […]

లోకేష్ ను మరింత బదనాం చేస్తున్న అధ్యయనం!
X

ప్రపంచంలో అత్యంత ప్రభావ శీల నేతలు, వ్యక్తులు అంటూ వివిధ అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఫలితాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఎవరు పవర్ లో ఉంటే అలాంటి వాళ్లను ప్రభావ శీల వ్యక్తులుగా చెబుతూ ఉంటాయి వివిధ సంస్థలు. రాజీవ్‌ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచంలోని అత్యంత అందగత్తెల్లో ఒకరుగా సోనియాను ఎంపిక చేసిందో సంస్థ.

ఇలాంటి నేపథ్యంలో…. తాజగా ఒక తలాతోక లేని సంస్థ ఏపీ మంత్రి నారా లోకేష్ ను దేశంలోనేఅత్యంత ప్రభావ శీల యవ నేతగా పేర్కొందంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేయడం ఆసక్తిదాయకంగా మారింది.

చంద్రబాబు తనయుడిని ఇప్పటికే చాలా మంది జాకీలు వేసి పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు అత్యంత ప్రభావ శీల యువనేత…. అది కూడా ప్రపంచ స్థాయిలో.. ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రభావ శీల వ్యక్తుల్లో లోకేష్ టాప్ ట్వంటీలో ఉన్నారు.. అని పేర్కొనడం అపహాస్యమే అవుతూ ఉంది.

ఈ విషయంలో లోకేష్ మీద సెటైర్లు తప్పడం లేదు.ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నట్టుగా ఉంది కథ. లోకేష్ ఇప్పటికే తన తీరుతో తీవ్రంగా విమర్శల పాలయ్యాడు. తన మాట తీరుతో లోకేష్ కామెడీ పీస్ గా మారాడు. సూటిగా మాట్లాడటం రాదు, స్పష్టంగా చెప్పడం రాదు, ఎవరిలోనూ స్ఫూర్తి నింపేలా మాట్లాటం సంగతలా ఉంటే.. కనీసం స్పష్టంగా మాట్లాడటం రావడం లేదు చంద్రబాబు నాయుడు తనయుడికి.

ఏదో తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి లోకేష్ మంత్రి అయ్యాడు. అది కూడా ప్రజల నుంచి ఎన్నిక కాకుండానే పదవిని సొంతం చేసుకున్నాడు. ఇదీ లోకేష్ సాధించింది. ఏపీ జనాల దృష్టిలో, తెలుగు ప్రజల దృష్టిలో లోకేష్ ఒట్టి కామెడీ పీస్. ఇలాంటి వ్యక్తిని అత్యంత ప్రభావ శీల యువనేత అంటూ మరింత పైకి జాకీలేసేందుకు ప్రయత్నిస్తూ ఉండటం మామూలు కామెడీ కావడం లేదు. ఇలాంటి ప్రయత్నాలు లోకేష్ ను లేపడం సంగతలా ఉంటే.. మరింత బదనాం చేస్తున్నాయని ఖాయంగా చెప్పవచ్చు.

First Published:  30 Nov 2018 11:19 AM IST
Next Story