శకుని
ఒక పథకం ప్రకారం పాచికలు వేసి ఎత్తుగడలతో కుయుక్తులతో మోసం చేసే వాళ్లని, మాయ చేసే వాళ్లని ‘శకుని’తో పోలుస్తూ ఉండటం మనం వింటూ ఉంటాం. శకుని పాచిక వేస్తే పారకుండా ఉంటుందా? ఎంతంటే అంత పడాల్సిందే. పడి తీరాల్సిందే. అంటే శకుని పాచికకు తిరుగులేదన్నమాట! ఈ శకుని పాత్రని పాత సినిమాల్లో చూసే ఉంటారు. ఆ పాత్ర వేసిన ధూళిపాలని చూస్తే చాలా ఆసక్తిగానే కాదు, ఆందోళనగా కూడా ఉంటుంది. అవును, ‘భారతం’లో కురుక్షేత్ర యుద్ధానికి […]
BY Pragnadhar Reddy30 Nov 2018 2:30 AM IST
Pragnadhar Reddy Updated On: 24 Oct 2018 4:28 PM IST
ఒక పథకం ప్రకారం పాచికలు వేసి ఎత్తుగడలతో కుయుక్తులతో మోసం చేసే వాళ్లని, మాయ చేసే వాళ్లని 'శకుని'తో పోలుస్తూ ఉండటం మనం వింటూ ఉంటాం. శకుని పాచిక వేస్తే పారకుండా ఉంటుందా? ఎంతంటే అంత పడాల్సిందే. పడి తీరాల్సిందే. అంటే శకుని పాచికకు తిరుగులేదన్నమాట! ఈ శకుని పాత్రని పాత సినిమాల్లో చూసే ఉంటారు. ఆ పాత్ర వేసిన ధూళిపాలని చూస్తే చాలా ఆసక్తిగానే కాదు, ఆందోళనగా కూడా ఉంటుంది. అవును, 'భారతం'లో కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన పరిస్థితులను పెంచిపోషించిన వాడే ఈ శకుని! ధుర్యోధనునితో 'మామా' అని పిలిపించుకున్న శకుని స్వయానా కౌరవులకు మేనమామే. ఇతనికి వృషకుడు, అచలుడు అన్నదమ్ములు. శకునికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు ఉలూకుడు. కౌరవుల దురాగతాలకు అంతకుమించిన దురాలోచనలు శకుని దగ్గర ఉండి ప్రోత్సహించే వాడు. అసలు ధర్మరాజుని జూదమాడమని దింపిందీ శకునే. ఆ మాయా జూదంలో పాచికలు వేసి పాండవులను ఓడించి కౌరవుల్ని గెలిపించేలా ఆడిందీ శకునే. పాండవులూ కౌరవుల మధ్య ఉన్న శతృత్వాన్ని తన కుటిల రాజ నీతితో పెంచిందీ శకునే. ఇంత కుటిలమైన పన్నాగాలు శకుని ఎందుకు పన్నాడు? ఏం ప్రయోజనం ఆశించి చేశాడు? దానికి కారణం ఉంది. శకునితో సహా సోదరులందరినీ కారాగారంలో వేసి పిడికెడు మెతుకులు వేసే వారట కౌరవులు. ఆ పిడికెడు మెతుకులను శకునికి ఇచ్చి అతని అన్నదమ్ములు ఆకలితోనే ఉండిపోయే వారట. అలా బతికి బట్టకట్టిన శకుని అంతకంతా తీర్చుకోవడానికని... ధుర్యోధనునికి ఎదురు తిరగలేక, ఆ శక్తి లేక, కౌరవ పక్షం చేరి ధుర్యోధనుడు సహా కౌరవ వంశాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో కౌరవుల్ని పాండవులపైకి ఎగదోశాడని చెబుతారు. శకుని మాయలు యుద్ధ సమయంలో సాగకుండా అర్జునుడు అడ్డుకట్ట వేశాడు. అయితే నకుల సహదేవుల చేతుల్లోనే చనిపోయాడు. ఎత్తులూ జిత్తులూ వేసి తగవులు పెట్టే మాయగాళ్లని ఇప్పటికీ 'శకుని' అనే పిలుస్తారు. అదన్నమాట శకుని అసలు కథ! - బమ్మిడి జగదీశ్వరరావు
Next Story