జనసేనలోకి రావెల....
టీడీపీ పత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టీడీపీని వీడుతున్నారు. త్వరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. డిసెంబర్ ఒకటిన విజయవాడలో పవన్ సమక్షంలో ఆయన జనసేనలో చేరుతారు. ఈ పరిణామం టీడీపీలో, జనసేలో చర్చనీయాంశమైంది. పార్టీలో చేరికపై పవన్‌తో రావెల ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతమవడంతో చేరికకు లైన్ క్లియర్ అయినట్టు చెబుతున్నారు. వివాదాస్పద వ్యక్తిగా పేరున్న రావెల కిషోర్‌బాబును జనసేనలోకి చేర్చుకునేందుకు పవన్ ఎలా ఓకే చేశారని జనసేన […]
టీడీపీ పత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టీడీపీని వీడుతున్నారు. త్వరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. డిసెంబర్ ఒకటిన విజయవాడలో పవన్ సమక్షంలో ఆయన జనసేనలో చేరుతారు. ఈ పరిణామం టీడీపీలో, జనసేలో చర్చనీయాంశమైంది. పార్టీలో చేరికపై పవన్‌తో రావెల ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతమవడంతో చేరికకు లైన్ క్లియర్ అయినట్టు చెబుతున్నారు.
వివాదాస్పద వ్యక్తిగా పేరున్న రావెల కిషోర్‌బాబును జనసేనలోకి చేర్చుకునేందుకు పవన్ ఎలా ఓకే చేశారని జనసేన శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని భూ అక్రమాలల్లో రావెల పాత్రతో పాటు, ఆయన కుమారులపైనా పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లో రావెల కుమారుడు ఒక ముస్లిం మహిళను రోడ్డుపైనే చేయి పట్టుకుని కారులోకి లాగబోయాడు. ఆ సమయంలో స్థానికులు అతడిని చితక్కొట్టారు.
కానీ తర్వాత కేసు రాజీ చేసుకున్నారు. మరో సందర్భంలో రావెల కిషోర్‌బాబు కుమారుడు మద్యం సేవించి అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు.
రావెల కిషోర్‌బాబు పైనా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. రావెల కిషోర్‌బాబు తనను వేధిస్తున్నాడంటూ గుంటూరు చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ అప్పట్లో బోరున విలపించారు. చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో అప్పట్లో ఆమె కన్నీరు పెట్టుకుని బాధపడ్డ వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది.
ఈ వ్యవహారశైలి వల్లే రావెల మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి టీడీపీపై అసంతృప్తిగా ఉన్న రావెల… వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వివాదాస్పద చరిత్ర కారణంగా వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనసేనలోకి వెళ్లేందుకు మార్గం ఏర్పడింది.