Telugu Global
Others

ఆ హీరో కోసం దిల్ రాజు ఎదురు చూపులు

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మనసు ప్రస్తుతం తమిళ్ సినిమా “96”పైనే ఉంది. ఈ సినిమాని తెలుగు లో ఎలాగైనా రీమేక్ చేయాలి అని భావించి సినిమా రీమేక్ రైట్స్ ని భారీ మొత్తానికి కొన్నాడు.  ఒరిజినల్ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ ని రూపొందించబోతున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు ఈ సినిమా లో హీరో కోసం వెతుకుతున్నాడు. మరో పక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా లో నటించేందుకు […]

ఆ హీరో కోసం దిల్ రాజు ఎదురు చూపులు
X

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మనసు ప్రస్తుతం తమిళ్ సినిమా “96”పైనే ఉంది. ఈ సినిమాని తెలుగు లో ఎలాగైనా రీమేక్ చేయాలి అని భావించి సినిమా రీమేక్ రైట్స్ ని భారీ మొత్తానికి కొన్నాడు. ఒరిజినల్ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ ని రూపొందించబోతున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు ఈ సినిమా లో హీరో కోసం వెతుకుతున్నాడు.

మరో పక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా లో నటించేందుకు ఇష్టపడుతున్నాడు. కానీ ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే దిల్ రాజు కి మాత్రం ఈ సినిమాలో గోపీచంద్ ని హీరోగా పెడితే బాగుంటుందని అని భావిస్తున్నాడు. ఒకవేళ దిల్ రాజు గాని గోపీచంద్ ని అడిగితే గోపీచంద్ ఈ సినిమా చేసే అవకాశం ఉంది. గోపీచంద్ ఒప్పుకోకపోతే మళ్ళి హీరో కోసం వేట కొనసాగిస్తాడు దిల్ రాజు. ఎందుకంటే తమిళ్ లో విజయ్ సేతుపతి పాత్ర చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి హీరోనే మళ్ళి తెలుగుకి చూస్తున్నాడు దిల్ రాజు.

First Published:  30 Nov 2018 10:07 AM IST
Next Story