కాంగ్రెస్ నేత ముక్కును నేలకు రాయించిన యువకులు
తప్పు చేస్తే నేలకు ముక్కును రాయించండీ అంటూ తరచూ తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రసంగాల్లో వాడుతుంటారు. రాజకీయ నాయకులు చాలా మంది అలా మాట్లాడటం చూస్తూనే ఉంటాం. కాని ఏ నాయకుడు నేలకు ముక్కు రాసిన ఘటన మనం చూడలేదు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఒక కాంగ్రెస్ నేత ముక్కును కొందరు యువకులు నేలకు రాయించారు. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ రాష్ట్రమంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం […]
తప్పు చేస్తే నేలకు ముక్కును రాయించండీ అంటూ తరచూ తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రసంగాల్లో వాడుతుంటారు. రాజకీయ నాయకులు చాలా మంది అలా మాట్లాడటం చూస్తూనే ఉంటాం. కాని ఏ నాయకుడు నేలకు ముక్కు రాసిన ఘటన మనం చూడలేదు.
తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఒక కాంగ్రెస్ నేత ముక్కును కొందరు యువకులు నేలకు రాయించారు. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ రాష్ట్రమంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం సాగ్వారా పట్టణంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆ ర్యాలీలో సచిన్ పైలెట్‌ను కలిసేందుకు భగవతి అనే కాంగ్రెస్ నేత కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక నీటి గుంటను దాటే క్రమంలో కారు వల్ల పక్కన ఉన్న యువకులపై బురద పడింది. దీంతో ఆగ్రహం చెందిన యువకులు కారును వెంబడించారు.
కొంత దూరం వెళ్లాక కారును అడ్డగించి కాంగ్రెస్ నేతను కిందకు దించారు. అక్కడ యువకులకు, కాంగ్రెస్ నేతకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చూడకుండా డ్రైవర్ నడపడం వల్ల అది జరిగిందని.. క్షమించమని భగవతి వేడుకున్నారు. అయినా సరే యువకులు ఆగ్రహంతో కాంగ్రెస్ నేతను మోకాళ్లపై నిలబెట్టి, ముక్కును నేలకు రాయించారు.
ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో ఆ యువకులను పటీదార్ వర్గం పెద్దలు పిలిచి వారి చేత కూడా ముక్కును నేలకు రాయించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి పిర్యాదు అందలేదని పోలీసులు తెలియజేశారు.