సుహాసిని మీద ప్రేముంటే ఆ పని చేయ్ చంద్రబాబు " కేటీఆర్
సీమాంధ్ర ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటున్న టీఆర్‌ఎస్‌కు… ఒక్క చంద్రబాబుతోనే పంచాయితీ ఎందుకుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు టీఆర్‌ఎస్ నేత కేటీఆర్. చంద్రబాబు కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారన్నారు కేటీఆర్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఒక కార్పొరేటర్‌ను మాత్రమే గెలుచుకుందని…. అది కూడా కూకట్‌పల్లికి పక్కనే ఉందన్నారు. అందుకే ఇక్కడ టీడీపీ ఆశలు పెట్టుకుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో కనిపించిన చంద్రబాబు…. ఇప్పుడు మళ్లీ వచ్చారన్నారు. చంద్రబాబుకు ఇక్కడి ప్రజలు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారన్నారు. […]
సీమాంధ్ర ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటున్న టీఆర్‌ఎస్‌కు… ఒక్క చంద్రబాబుతోనే పంచాయితీ ఎందుకుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు టీఆర్‌ఎస్ నేత కేటీఆర్. చంద్రబాబు కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారన్నారు కేటీఆర్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఒక కార్పొరేటర్‌ను మాత్రమే గెలుచుకుందని…. అది కూడా కూకట్‌పల్లికి పక్కనే ఉందన్నారు. అందుకే ఇక్కడ టీడీపీ ఆశలు పెట్టుకుందన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో కనిపించిన చంద్రబాబు…. ఇప్పుడు మళ్లీ వచ్చారన్నారు. చంద్రబాబుకు ఇక్కడి ప్రజలు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారన్నారు. 13 సీట్లలో టీడీపీ పోటీ చేస్తోందని… ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచినా, ఓడినా చంద్రబాబుకు పోయేది ఏమీ లేదన్నారు. కానీ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోతే నష్టపోయేది ప్రజలేనన్నారు.
పొరపాటున ఇక్కడి ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే కూకట్‌పల్లిలో అభివృద్ధి దెబ్బతినే అవకాశం ఉందన్నారు. నాలుగున్నరేళ్ల పాటు ఇక్కడి ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సీమాంధ్రులపై వివక్ష చూపుతారని తప్పుడు ప్రచారం చేశారని…. కానీ టీఆర్‌ఎస్ పాలనలో అలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదన్నారు.
ఎవరిపట్ల కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్ష చూపబోదన్నారు. కూకట్‌పల్లి నుంచి లోకేష్ ఎందుకు పోటీ చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం నందమూరి కుటుంబాన్ని బలిపశువును చేసేందుకే నందమూరి సుహాసినిని బరిలో దింపారని విమర్శించారు. నందమూరి కుటుంబంపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే సుహాసినీకి ఏపీలో మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు.
కులం పేరుతో, మతం పేరులో ఇక్కడి ప్రజలను విభజించాలనుకుంటున్న వారి మాటలకు లొంగిపోకుండా ఆలోచించి ఓటేయాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ మధ్య స్నేహం నాగుపాము, ముంగీస కలిసినట్టుగా ఉందన్నారు. తెలంగాణలో ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బీసీలుగా గుర్తిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.