Telugu Global
National

చాలా ఊహించుకున్న టీడీపీ పత్రిక.... హ్యాండ్‌ ఇచ్చిన మాయావతి, రాహుల్‌....

చంద్రబాబు అడుగేస్తే అదరహో అన్నట్టు ప్రచారం చేయడం…. ఆయన అనుకూల మీడియాకు వెన్నతో పెట్టిన విద్యే. చంద్రబాబే ఇతర రాష్ట్రాల నేతల వద్ద అపాయింట్‌మెంట్‌ తీసుకుని వారి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నేతలను కలిసినా సరే… చంద్రబాబు దేశంలో అందరి కంటే గొప్పనాయకుడు, సీనియర్ నాయకుడు అంటూ ప్రచారం చేస్తోంది మీడియా.  చంద్రబాబు కలుస్తున్న ఇతర రాష్ట్రాల నేతలంతా ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న వారేనని  అందరికీ తెలిసినా.. చంద్రబాబు మాత్రం తాను వెళ్లి వారందరిని బీజేపీకి […]

చాలా ఊహించుకున్న టీడీపీ పత్రిక.... హ్యాండ్‌ ఇచ్చిన మాయావతి, రాహుల్‌....
X

చంద్రబాబు అడుగేస్తే అదరహో అన్నట్టు ప్రచారం చేయడం…. ఆయన అనుకూల మీడియాకు వెన్నతో పెట్టిన విద్యే. చంద్రబాబే ఇతర రాష్ట్రాల నేతల వద్ద అపాయింట్‌మెంట్‌ తీసుకుని వారి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నేతలను కలిసినా సరే… చంద్రబాబు దేశంలో అందరి కంటే గొప్పనాయకుడు, సీనియర్ నాయకుడు అంటూ ప్రచారం చేస్తోంది మీడియా.

చంద్రబాబు కలుస్తున్న ఇతర రాష్ట్రాల నేతలంతా ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న వారేనని అందరికీ తెలిసినా.. చంద్రబాబు మాత్రం తాను వెళ్లి వారందరిని బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నారు.

చంద్రబాబును ఓ రేంజ్ లో మోస్తున్న మీడియా…. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ కంటే చంద్రబాబుకే గొప్పగా ప్రచారం చేస్తోంది.

టీడీపీ అనుకూల పత్రిక ఒకటి గురువారం ఉదయం మరో అడుగు ముందుకేసి చంద్రబాబును పైకి లేపేందుకు ఒక వార్తను ప్రచురించింది. హైదరాబాద్‌లో ఉన్న రాహుల్‌ గాంధీని బ్రేక్‌పాస్ట్‌ కోసం పార్క్‌ హయత్‌ హోటల్‌కు రావాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించారని సదరు మీడియా సంస్థ వెల్లడించింది.

అంతటితో ఆగకుండా అదే పార్క్‌ హయత్‌ హోటల్‌లో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ మాజీ సీఎం మాయావతి కూడా ఉన్నారని వెల్లడించింది. ఇదే అదునుగా రాహుల్‌ గాంధీ, మాయావతిని బ్రేక్‌పాస్ట్ సమయంలో చంద్రబాబు కలుపుతారని చెప్పుకొచ్చింది.

కాంగ్రెస్‌కు ఇటీవల దూరంగా ఉంటున్న మాయావతి…. కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా చేసేందుకు చంద్రబాబు… రాహుల్‌, మాయావతిని బ్రేక్‌పాస్ట్‌కు ఆహ్వానించి వారి మధ్య గ్యాప్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారని సదరు మీడియా సంస్థ చెప్పుకొచ్చింది.

ఈ వార్తను చూసి టీడీపీ శ్రేణులు ఉప్పొంగిపోయాయి. కానీ సదరు మీడియా సంస్థ ఊహించుకుని చాలా రాసిందేగానీ.. అనుకున్నది మాత్రం జరగలేదు. చంద్రబాబు ఆహ్వానిస్తే… రాహుల్‌తో బ్రేక్‌ పాస్ట్‌కు మాయావతి రావడం దేవుడెరుగు.. అసలు రాహుల్‌ గాంధీ కూడా చంద్రబాబు విన్నపాన్ని మన్నించలేదని చెబుతున్నారు.

దీంతో అప్పటి వరకు పార్క్‌ హయత్‌ హోటల్‌లో రాహుల్‌, మాయావతిని కూర్చోబెట్టి చంద్రబాబు చక్రం తిప్పుతారని ప్రచారం చేసిన మీడియా సంస్థ మౌనాన్ని ఆశ్రయించింది. బ్రేక్‌ పాస్ట్‌ గురించి అప్‌డేట్‌ లేకుండా జాగ్రత్త పడింది.

First Published:  29 Nov 2018 10:16 AM GMT
Next Story