ఏపీలో చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటారు " తలసాని
తెలంగాణలో ఏర్పడింది మహాకూటమి కాదు.. ఆదో మాయకూటమన్నారు టీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్. మహాకూటమి ప్రకటన ఫొటోలు చూస్తే ఆలీబాబా 40 దొంగల్లా ఉన్నారని ఎద్దేవా చేశారు. మూడు సీట్లకు పోటీ చేస్తున్న సీపీఐ ఒక మేనిఫెస్టో, 13 సీట్లకు పోటీ చేస్తున్న టీడీపీ ఒక మేనిఫెస్టో, 8 సీట్లకు పోటీ చేస్తున్న టీజేఎస్ ఒక మేనిఫెస్టో, కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో విడుదల చేసిందని… దీన్ని బట్టి మహాకూటమి రూపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మహాకూటమి అధికారంలోకి […]
తెలంగాణలో ఏర్పడింది మహాకూటమి కాదు.. ఆదో మాయకూటమన్నారు టీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్. మహాకూటమి ప్రకటన ఫొటోలు చూస్తే ఆలీబాబా 40 దొంగల్లా ఉన్నారని ఎద్దేవా చేశారు.
మూడు సీట్లకు పోటీ చేస్తున్న సీపీఐ ఒక మేనిఫెస్టో, 13 సీట్లకు పోటీ చేస్తున్న టీడీపీ ఒక మేనిఫెస్టో, 8 సీట్లకు పోటీ చేస్తున్న టీజేఎస్ ఒక మేనిఫెస్టో, కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో విడుదల చేసిందని… దీన్ని బట్టి మహాకూటమి రూపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే నాలుగు మేనిఫెస్టోల తరహాలోనే నాలుగు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారా? అని తలసాని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్‌లో కలిపేశారని.. దాని ప్రభావం రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు అనుభవిస్తారన్నారు. అధికారం ఉంది కాబట్టి చాలా మంది టీడీపీ నేతలు చంద్రబాబును ధిక్కరించడం లేదని.. కానీ ఎన్నికల సమయంలో వారంతా చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటారని తలసాని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మీడియా వైర్లన్నింటిని మెడలో వేసుకుని తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఏం చేసినా గొప్పగా ప్రచారం జరుగుతోందన్నారు. అమరావతిలో ఏమి నిర్మించకుండా సింగపూర్, మలేషియా అంటూ ప్రజలను నమ్మిస్తున్నారంటే చంద్రబాబు మెడలో ఉన్న మీడియా వైర్లే కారణమన్నారు. చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కలుస్తున్న నేతలంతా ఖాళీగా ఉన్నవారేనని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక కార్పొరేటర్‌ను మాత్రమే గెలిపించుకోగలిగిన టీడీపీ…. తెలంగాణలో ఇంకా ఉందంటే ఎవరు నమ్ముతారని తలసాని ప్రశ్నించారు.