సీబీఐకి కేసు అప్పగించిన హైకోర్టు
ఏపీలో సీబీఐ ఎంట్రీపై చంద్రబాబు నిషేధం విధించిన తర్వాత ఏపీలో సీబీఐ అడుగు పెట్టబోతోంది. విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఈ కేసు విచారించబోతుంది. ఈ కేసులో రికార్డులను ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బంది పైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ కోర్టు సిబ్బందిపైనా కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ ఏపీలోకి అడుగుపెట్టబోతోంది. 2007 డిసెంబర్ […]
ఏపీలో సీబీఐ ఎంట్రీపై చంద్రబాబు నిషేధం విధించిన తర్వాత ఏపీలో సీబీఐ అడుగు పెట్టబోతోంది. విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
కోర్టు ఆదేశాలతో సీబీఐ ఈ కేసు విచారించబోతుంది. ఈ కేసులో రికార్డులను ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బంది పైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ కోర్టు సిబ్బందిపైనా కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ ఏపీలోకి అడుగుపెట్టబోతోంది.
2007 డిసెంబర్ 27న ఫార్మసీ విద్యార్థిని అయిన ఆయేషా మీరా విజయవాడలోని ఒక హాస్టల్‌లో హత్యకు గురైంది. బాత్‌రూంలో ఆమె రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కన ఓ లేఖ ఉంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను అత్యాచారం చేసినట్టు లేఖ ఉంది.
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా జగ్గయ్యపేట మండలం ఆనాసాగరానికి చెందిన సత్యంబాబును గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. 2010 సెప్టెంబర్‌లో విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబుకు రేప్ చేసినందుకు పదేళ్లు, ఆమెను హత్య చేసినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇటీవల హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది.
ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవడంతో హైకోర్టు సీబీఐ విచారణకు తాజాగా ఆదేశించింది.