దేశంపై దయతో ఇంజనీర్ అవడం మానుకో " విద్యార్థికి చీఫ్ జస్టిస్ విజ్ఞప్తి
చండీగడ్ హైకోర్టులో ఆసక్తికరమైన పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషన్ వివరాలు తెలుసుకున్న చీఫ్ జస్టిసే ఆశ్చర్యపోయాడు. 2009లో ఒక విద్యార్థి చండీగడ్‌లోని కురుక్షేత్ర నిట్‌లో చేరాడు. నాలుగేళ్లకు పూర్తి చేయాల్సిన కోర్సును పూర్తి చేయలేకపోయాడు. 17 బ్యాక్‌లాగ్స్‌ను మిగిల్చాడు. వాటిని పూర్తి చేయడానికి కళాశాల మరో నాలుగేళ్ల గడువు ఇచ్చింది. అయినా సరే మనోడు బ్యాక్ లాగ్స్‌ను లాగించలేకపోయాడు. దీంతో సదరు విద్యార్థికి మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని కాలేజీ నిరాకరించింది. కాలేజీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ […]
చండీగడ్ హైకోర్టులో ఆసక్తికరమైన పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషన్ వివరాలు తెలుసుకున్న చీఫ్ జస్టిసే ఆశ్చర్యపోయాడు.
2009లో ఒక విద్యార్థి చండీగడ్‌లోని కురుక్షేత్ర నిట్‌లో చేరాడు. నాలుగేళ్లకు పూర్తి చేయాల్సిన కోర్సును పూర్తి చేయలేకపోయాడు. 17 బ్యాక్‌లాగ్స్‌ను మిగిల్చాడు.
వాటిని పూర్తి చేయడానికి కళాశాల మరో నాలుగేళ్ల గడువు ఇచ్చింది. అయినా సరే మనోడు బ్యాక్ లాగ్స్‌ను లాగించలేకపోయాడు. దీంతో సదరు విద్యార్థికి మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని కాలేజీ నిరాకరించింది.
కాలేజీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు విద్యార్థి హైకోర్టులో పిటిషన్ వేశాడు. తనకు పరీక్షరాసే హక్కు ఉందని… అందుకు అవకాశం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరాడు.
ఒక్క చాన్స్ ఇస్తే ఈసారి మొత్తం బ్యాక్ లాగ్స్‌ను క్లోజ్ చేస్తానని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాడు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్…అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నాడు.
నాలుగేళ్ల కోర్సుకు తొమ్మిదేళ్లుగా విద్యార్థి పోరాటం చేస్తున్న తీరుతో అవాక్కయ్యారు సీజే కృష్ణ మురారి. ” బాబూ.. నాయనా.. ఈ దేశ క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకో. దేశంపై కాస్త దయచూపు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీవు ఇంజనీర్ కావాలన్న ఆలోచన వదులుకో. ఇక సప్లిమెంటరీ పరీక్షలు రాయొద్దు. మరేదైనా కోర్సులోకి వెళ్లు” అంటూ చీఫ్ జస్టిస్ విజ్ఞప్తి చేశారు.
నాలుగేళ్లలో 17 బ్యాక్ లాగ్స్ పూర్తి చేయలేని వాడికి ఇప్పుడు ఒక్క చాన్స్ ఇస్తే ఎలా పూర్తి చేస్తావ్ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాలాన్ని వృధా చేయడం మానేసి… వెళ్లి ఇంకేదైనా కోర్సులో చేరు అంటూ సలహా ఇచ్చారు. విద్యార్థికి పరీక్షలు రాసేందుకు కాలేజీ అనుమతి నిరాకరించడం సరైనదేనని కోర్టు అభిప్రాయపడింది.