విలేకరి ప్రశ్నకు జవాబు చెప్పలేక నామా సతమతం....
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి ఈరోజు మధ్యాహ్నం ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో తొలిసారి పాల్గొనబోతున్నారు. తెలంగాణ ప్రచార యుద్ధంలో ఈ ఇద్దరు కలిసి పాల్గొనే తొలి సభ కావడంతో ఆసక్తి రేపుతోంది. వీరిద్దరు ఏం మాట్లాడుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సందర్భంగా ఖమ్మంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరావు బుధవారం ఉదయం సభా ప్రాంగణం నుంచి ఓ మీడియా చానెల్ తో మాట్లాడారు. […]
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి ఈరోజు మధ్యాహ్నం ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో తొలిసారి పాల్గొనబోతున్నారు. తెలంగాణ ప్రచార యుద్ధంలో ఈ ఇద్దరు కలిసి పాల్గొనే తొలి సభ కావడంతో ఆసక్తి రేపుతోంది. వీరిద్దరు ఏం మాట్లాడుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సందర్భంగా ఖమ్మంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరావు బుధవారం ఉదయం సభా ప్రాంగణం నుంచి ఓ మీడియా చానెల్ తో మాట్లాడారు. ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించే అంశాలను ఆయన లేవనెత్తారు. హైటెక్ సిటీ కట్టించింది బాబే… హైదరాబాద్ ను డెవలప్ చేసింది బాబే అని సమర్థించుకున్నారు.
ఈ సందర్భంగా సదరు జర్నలిస్టు కేసీఆర్ విమర్శలను నామా నాగేశ్వరరావు ముందు ఉంచారు. ఖమ్మంలో నిర్వహించిన ప్రచార సభల్లో ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు సీతారామా ప్రాజెక్ట్ సహా కొన్ని ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ఢిల్లీకి రాసిన లేఖలు చూపించారని దానిపై ఏం సమాధానం చెప్తారని నామా నాగేశ్వరరావును సదరు జర్నలిస్టు ప్రశ్నించారు.
దీంతో నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా నామా కవర్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ లేఖలో బాబు సంతకం ఎక్కడా పెట్టలేదని.. కేవలం ప్రాజెక్టు డీపీఆర్ లు సరిగా లేవని పునః సమీక్షించాలని మాత్రమే ప్రభుత్వం తరుఫున పంపిన లేఖలో కోరారని కవర్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను బాబు అడ్డుకోవడం లేదని బుకాయించాడు. అయినా గోదావరి పైన ఉన్న వాళ్ళు ఎంతైనా వాడుకోవచ్చని… కింద ఉన్న ఏపీ మాత్రమే నీళ్లు రావని భయపడాలని నామా సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే బాబు లేఖలపై నామా కవరింగ్ సాధ్యపడలేదు. ఖమ్మం ప్రాజెక్టులపై బాబు ఏపీ సీఎం హోదాలో లేఖ రాసిన మాట వాస్తవమే.. అయితే దీన్ని అంగీకరిస్తే తెలంగాణలో ఓట్లు పడే అవకాశాలు టీడీపీకి లేవు. అందుకే కక్కలేక మింగలేక కేసీఆర్ విసిరిన ఈ అస్త్రాన్ని ఎలా కవర్ చేయాలో తెలియక నామా అష్టకష్టాలు పడ్డారు.