జగన్ స్పందించాలంటూ దీక్షకు దిగిన మాజీ ఇన్‌చార్జ్
ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ వైసీపీలో విభేదాలు పరిష్కారం కావడం లేదు. నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉంటూ వచ్చిన అశోక్‌బాబును తొలగించి ఆయన స్థానంలో మరొకరిని ఇన్‌చార్జ్ గా నియమించారు. అయినప్పటికీ అశోక్‌బాబు వెనక్కు తగ్గలేదు. పార్టీ ఇన్‌చార్జ్‌కు పోటీగా పార్టీ నిర్ణయాలను లెక్క చేయకుండా సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. పార్టీ హెచ్చరించినా ఆయన మాట వినలేదు. దీంతో ఇటీవల పార్టీ నుంచి అశోక్‌బాబును బహిష్కరించారు. ఈ చర్యను నిరసిస్తూ నిరవధిక దీక్షకు దిగారు. తనపై […]
ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ వైసీపీలో విభేదాలు పరిష్కారం కావడం లేదు. నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉంటూ వచ్చిన అశోక్‌బాబును తొలగించి ఆయన స్థానంలో మరొకరిని ఇన్‌చార్జ్ గా నియమించారు. అయినప్పటికీ అశోక్‌బాబు వెనక్కు తగ్గలేదు. పార్టీ ఇన్‌చార్జ్‌కు పోటీగా పార్టీ నిర్ణయాలను లెక్క చేయకుండా సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.
పార్టీ హెచ్చరించినా ఆయన మాట వినలేదు. దీంతో ఇటీవల పార్టీ నుంచి అశోక్‌బాబును బహిష్కరించారు. ఈ చర్యను నిరసిస్తూ నిరవధిక దీక్షకు దిగారు. తనపై వేటు విషయంలో జగన్ స్పందించే వరకు మంచినీళ్లు కూడా ముట్టబోనని ప్రకటించారు.
తాను వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం నిరవధిక దీక్షకు దిగలేదని, తనతోపాటు నాలుగున్నరేళ్ల కాలాన్ని, డబ్బును వృథా చేసుకుని పార్టీ కోసం కష్టపడిన వారి కోసమే పోరాడుతున్నానని చెప్పారు.
తాను ఏ తప్పూ చేయలేదని అయినా ఎందుకు వేటు వేశారో అర్థం కావడం లేదన్నారు. తనపై వేటు విషయం జగన్‌కు తెలియదని ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు దీక్షకు దిగానని అశోక్ బాబు చెప్పారు.