Telugu Global
NEWS

ఏపీలో పది లక్షల ఉద్యోగాలు కల్పించా

తెలంగాణలో మహాకూటమి విజయం సాధించడం చారిత్రక అవసరమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన బాబు… నాలుగున్నరేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతే… లోటు బడ్జెట్ ఉన్న ఏపీ అద్బుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. ప్రజా కూటమి గెలుపు దేశ రాజకీయాలకే మేలుమలుపు కావాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పలు అంశాలపై ఏపీ, తెలంగాణను పోల్చారు బాబు. తెలంగాణలో లక్ష రుణమాఫి మాత్రమే చేస్తే… ఏపీలో […]

ఏపీలో పది లక్షల ఉద్యోగాలు కల్పించా
X

తెలంగాణలో మహాకూటమి విజయం సాధించడం చారిత్రక అవసరమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన బాబు… నాలుగున్నరేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతే… లోటు బడ్జెట్ ఉన్న ఏపీ అద్బుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు.
ప్రజా కూటమి గెలుపు దేశ రాజకీయాలకే మేలుమలుపు కావాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

పలు అంశాలపై ఏపీ, తెలంగాణను పోల్చారు బాబు. తెలంగాణలో లక్ష రుణమాఫి మాత్రమే చేస్తే… ఏపీలో లక్షన్నర చేశామన్నారు.

డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదన్నారు. అదే తాను డ్వాక్రా మహిళలకు పదివేలు ఇచ్చానని చెప్పారు. ఏపీలో 10 లక్షల ఉద్యోగాలను తాము కల్పిస్తే… తెలంగాణలో సగం కూడా ఉద్యోగ కల్పన లేదని విమర్శించారు.

ఏపీలో తన ప్రభుత్వం ఇచ్చిన ధీమాతో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయని… తెలంగాణలో మాత్రం ఐదు వేల మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమన్నారు. తెలంగాణలో ప్రతి టీడీపీ కార్యకర్త సమర్ధవంతంగా పనిచేసి మహాకూటమి గెలుపుకు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

First Published:  28 Nov 2018 6:29 AM IST
Next Story