Telugu Global
Family

తాటకి

మనం సినిమాల్లో పేద్ద పేద్ద రాక్షసుల్ని చూస్తూ ఉంటాం. రాక్షసుల దగ్గర రాజులైనా సరే లిల్లీపుట్టుల్లా ఉంటారు. రాక్షసులు తాటిచెట్లనైనా పూచిక పుల్లల్లా పీకి పారేస్తూ ఉంటారు. కొండల్ని, పెద్ద పెద్ద బండల్ని గోళీకాయల్లా విసిరేస్తూ ఉంటారు. వాళ్ల కాళ్లు ఏనుగు కాళ్లలా ఉంటాయి.వాళ్ల చేతులు మర్రి ఊడల్లా పొడవుగా ఉంటాయి.

తాటకి
X

మనం సినిమాల్లో పేద్ద పేద్ద రాక్షసుల్ని చూస్తూ ఉంటాం. రాక్షసుల దగ్గర రాజులైనా సరే లిల్లీపుట్టుల్లా ఉంటారు. రాక్షసులు తాటిచెట్లనైనా పూచిక పుల్లల్లా పీకి పారేస్తూ ఉంటారు. కొండల్ని, పెద్ద పెద్ద బండల్ని గోళీకాయల్లా విసిరేస్తూ ఉంటారు. వాళ్ల కాళ్లు ఏనుగు కాళ్లలా ఉంటాయి.వాళ్ల చేతులు మర్రి ఊడల్లా పొడవుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ల అరచెయ్యి ఆరు మైళ్ల మైదానంలా ఉంటుంది.

మరి అలాంటి రాక్షసి గురించి తెలుసుకుందామా?

'తాటకి' అని చెప్పుకుంటూ ఉండగా వినే ఉంటాం. ఈమె సుకేతుని కూతురు. ఆమెది ఒక ఏనుగు బలం కాదు, వేయి ఏనుగుల బలమట. అసలు మొట్టమొదట తాటకి చాలా అందంగా అపురూపంగా ఉండేదట. అయితే అగస్త్యుని హింసించబోతే శపించాడని, ఆ శాప ఫలితంగానే వికృత రూపం పొందిందని అంటారు.

తాటకి సునందుణ్ని పెళ్లాడింది. మారీచుడు ఈమె కుమారుడని తెలుసు కదా? వీళ్లేం చేసే వారూ?

మునులను బాధ పెట్టడం,వారి పూజా ద్రవ్యాలను ఎత్తుకుపోవడం, ఆశ్రమాల్లో అగ్ని గుండాల్లో రక్తపు వర్షం కురిపించడం చేస్తూ ఉండేవారు.

దశరథుని ఒప్పించి రాముని తన వెంట తీసుకువచ్చిన విశ్వామిత్రుడు తాటకిని సంహరించమని కోరుతాడు. రాముడు వేసిన బాణాలకు తాటకి తల్లడిల్లిపోవడమే కాదు, నేల కొరిగిపోయింది.

ఇప్పటికీ 'తాటకిలా తయారయ్యావు' అని... విసిగించే వాళ్లని ఉద్దేశించి అనడం వింటూ ఉంటాం. ఆ తాటకి కథే ఇది!

- బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  5 Aug 2022 2:30 AM GMT
Next Story