"లక్ష్మిస్ ఎన్టీఆర్" గురించి బాలక్రిష్ణ తో చర్చించలేదు
నందమూరి బాలక్రిష్ణ కి మొత్తానికి తన కలల ప్రాజెక్ట్ అయిన “ఎన్టీఆర్” బయోపిక్ ని స్టార్ట్ చేసి పూర్తీ చేసే స్టేజి కి తీసుకొచ్చాడు. మరో వైపు రామ్ గోపాల్ వర్మ కూడా తన “లక్ష్మిస్ ఎన్టీఆర్” సినిమా యొక్క షూటింగ్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే మొదట “ఎన్టీఆర్” బయోపిక్ ని డైరెక్ట్ చెయ్యడం కోసం రామ్ గోపాల్ వర్మ ని అనుకున్నారు, ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ శిష్యుడు తేజ […]

నందమూరి బాలక్రిష్ణ కి మొత్తానికి తన కలల ప్రాజెక్ట్ అయిన “ఎన్టీఆర్” బయోపిక్ ని స్టార్ట్ చేసి పూర్తీ చేసే స్టేజి కి తీసుకొచ్చాడు. మరో వైపు రామ్ గోపాల్ వర్మ కూడా తన “లక్ష్మిస్ ఎన్టీఆర్” సినిమా యొక్క షూటింగ్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే మొదట “ఎన్టీఆర్” బయోపిక్ ని డైరెక్ట్ చెయ్యడం కోసం రామ్ గోపాల్ వర్మ ని అనుకున్నారు, ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ శిష్యుడు తేజ ని అనుకున్నారు. కానీ ఫైనల్ గా క్రిష్ ని ఈ సినిమాకి డైరెక్టర్ గా చేసి ప్రాజెక్ట్ ని పూర్తీ చేసే పనిలో ఉన్నాడు బాలక్రిష్ణ .
ఇదిలా ఉంటే ఇటివలే రామ్ గోపాల్ వర్మ ని “ఎన్టీఆర్” బయోపిక్ డైరెక్ట్ చెయ్యడం లేదు అనే కోపంతోనే “లక్ష్మిస్ ఎన్టీఆర్” తీస్తున్నారా అని అడిగితే “ఆ సినిమా ఇవ్వలేదనే కారణంగా నేను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయడం లేదు. నాకు మొదటి నుంచి ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అంటే ఇంట్రెస్ట్. అందుకని తీస్తున్నా. ఎన్టీఆర్ బయోపిక్‌కి, మా సినిమాకు సంబంధం వుండదు. అసలు ఇప్పటి వరకు “లక్ష్మిస్ ఎన్టీఆర్” గురించి బాలక్రిష్ణతో చర్చించలేదు” అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.