తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ మద్దతుపై విజయసాయిరెడ్డి క్లారిటీ
తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఏపార్టీకి కూడా మద్దతు ఇవ్వలేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కేవలం తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని మాత్రమే ప్రకటించామన్నారు. తెలంగాణ ప్రజలు వారి ఆత్మప్రభోదానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. టీడీపీని మాత్రం ఓడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు దృష్టిలో బీసీ అంటే ‘బాబుగారి క్యాస్ట్’ అని మాత్రమే అర్థమన్నారు. చరిత్రలో ఏఒక్కరు చేయనన్ని పాపాలు చంద్రబాబు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రొద్దుటూరులో నిర్వహించిన ధర్మపోరాట […]
తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఏపార్టీకి కూడా మద్దతు ఇవ్వలేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కేవలం తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని మాత్రమే ప్రకటించామన్నారు. తెలంగాణ ప్రజలు వారి ఆత్మప్రభోదానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. టీడీపీని మాత్రం ఓడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు దృష్టిలో బీసీ అంటే ‘బాబుగారి క్యాస్ట్’ అని మాత్రమే అర్థమన్నారు.
చరిత్రలో ఏఒక్కరు చేయనన్ని పాపాలు చంద్రబాబు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రొద్దుటూరులో నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు … జనాన్ని తరలించేందుకు టీటీడీ బస్సులను కూడా వాడడం దారుణమన్నారు. టీటీడీకి చెందిన బస్సుల్లో మాంసం, మద్యం కూడా తరలించారని ఆరోపించారు.
భగవంతుడు అన్నీ చూస్తున్నాడని చంద్రబాబు పాపాలను దేవుడు క్షమించడన్నారు. తిరుమల అభరణాలను చంద్రబాబు దోపిడి చేశారని తాను ఆరోపిస్తే టీటీడీ సొమ్మును ఫీజుగా చెల్లించి తనపై పరువునష్టం దావా వేశారన్నారు. తిరుమలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని తాను ఆరోపణ చేస్తే పరువు నష్టం అంటూ జరిగి ఉంటే చంద్రబాబుకు జరిగి ఉండాలే గానీ… టీటీడీ తరపున పరువు నష్టం దావా వేయడం ఏమిటని ప్రశ్నించారు.
పోలీసు అధికారులు కొందరు చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్నారన్నారు. చట్టవిరుద్దంగా వ్యవహరించే పోలీసులపై తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోదా కోసం మొట్టమొదట కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది, ఆందోళనలు చేసింది వైసీపీనేనన్నారు.
నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేసి విపరీతంగా అవినీతి చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకుని కేంద్రంపై ఏదో పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ జత కట్టే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు తరహాలో స్వార్థంకోసం పొత్తులు పెట్టుకునే పార్టీ వైసీపీ కాదన్నారు. 2019 ఎన్నికల తర్వాత అవసరమైతే తిరిగి బీజేపీతో కలిసి వెళ్లేది చంద్రబాబేనన్నారు.