Telugu Global
NEWS

పారిపోయిన వారిని కూడా వదిలే ప్రసక్తే లేదు " నిజామాబాద్‌లో మోడీ

సీఎంగా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ నష్టపోయిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్‌ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ… టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అంతర్గత స్వేచ్చ లేదన్నారు. రజాకార్లను ధైర్యంగా ఎదుర్కొన్న నేల తెలంగాణ అని కొనియాడారు. కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్ వేరు వేరు కాదని ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మోడీ ఆరోపించారు. ఒకే వేదికపై తల్లికొడుకు కూర్చుని కుటుంబపాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సోనియా, […]

పారిపోయిన వారిని కూడా వదిలే ప్రసక్తే లేదు  నిజామాబాద్‌లో మోడీ
X

సీఎంగా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ నష్టపోయిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్‌ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ… టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అంతర్గత స్వేచ్చ లేదన్నారు.

రజాకార్లను ధైర్యంగా ఎదుర్కొన్న నేల తెలంగాణ అని కొనియాడారు. కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్ వేరు వేరు కాదని ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మోడీ ఆరోపించారు. ఒకే వేదికపై తల్లికొడుకు కూర్చుని కుటుంబపాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సోనియా, రాహుల్‌ గురించి మోడీ విమర్శించారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ అబద్దాలు ప్రచారంచేయడంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో ప్రశ్నించాల్సిన సమయం ఇదేనన్నారు.

హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీని చేస్తానని కేసీఆర్‌ చెప్పారని…. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం బలహీన రాష్ట్రాల్లో తరహాలోనే ఉందన్నారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోనని కేసీఆర్‌ చెప్పారని.. ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్న టీఆర్ఎస్‌ను ఇంటికి పంపించాలని పిలుపు నిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు సరైన వైద్యం కూడా అందడం లేదని విమర్శించారు. దోపిడిని అరికట్టేందుకు 6కోట్ల నకిలీ అకౌంట్లను తొలగించామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కుంభకోణాలను అరికట్టామన్నారు. దోపిడి దారుల పనిపట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చామన్నారు.

దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అన్ని రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని… తెలంగాణలో కూడా విశ్వాసఘాతక కాంగ్రెస్‌ను అడుగుపెట్టకుండా చూడాలని కోరారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు.

First Published:  27 Nov 2018 8:08 AM IST
Next Story