మాట తప్పిన జేడీ ? షాక్ తిన్న జేపీ !
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్‌సత్తాలో చేరిపోవడం దాదాపు ఖాయమని అందరూ భావించారు. అందుకోసం వేదికగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే చివర్లో మాజీ జేడీ…. లోక్‌సత్తా అధినేతకు హ్యాండ్ ఇచ్చారని లోక్‌సత్తా అభిమానులు ఆవేదన చెందుతున్నారు. నిన్నటి నుంచి లోక్‌సత్తా నాయకులు లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలు జేపీకి, మాజీ జేడీకి ఈ అవగాహన ఎలా కుదిరిందన్న విషయాన్ని ఇప్పుడు బయటకు వివరిస్తున్నారు. లోక్‌సత్తా నాయకులు చెబుతున్న దాని ప్రకారం…. జేడీ […]
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్‌సత్తాలో చేరిపోవడం దాదాపు ఖాయమని అందరూ భావించారు. అందుకోసం వేదికగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే చివర్లో మాజీ జేడీ…. లోక్‌సత్తా అధినేతకు హ్యాండ్ ఇచ్చారని లోక్‌సత్తా అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
నిన్నటి నుంచి లోక్‌సత్తా నాయకులు లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలు జేపీకి, మాజీ జేడీకి ఈ అవగాహన ఎలా కుదిరిందన్న విషయాన్ని ఇప్పుడు బయటకు వివరిస్తున్నారు. లోక్‌సత్తా నాయకులు చెబుతున్న దాని ప్రకారం…. జేడీ లక్ష్మీనారాయణ లోక్‌సత్తా ఆఫీస్‌కు రెండు మూడు సార్లు వెళ్ళి జయప్రకాశ్ నారాయణతో ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి, పార్టీ పెట్టడం గురించి చర్చించారట. గత శుక్ర/శని వారం నాడు జేడీ, జేపీలు సుదీర్ఘంగా జరిపిన చర్చల తర్వాత లోక్‌సత్తాలో చేరుతానని జేడీ ప్రకటించాడట.
అందుకు జయప్రకాశ్‌నారాయణ కూడా అంగీకారం తెలిపారని చెబుతున్నారు. దాంతో పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ… 69వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సభ ఏర్పాటు చేసి తనను జేపీ స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీలో చేరుతానని జేపీని కోరారని లోక్‌సత్తా నాయకులు చెబుతున్నారు.
లక్ష్మీనారాయణ పార్టీలో చేరుతున్నారన్న ఆనందంతో లోక్‌సత్తాకు చెందిన చాలా మంది నాయకులు వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమానికి వచ్చారు. ముందుగానే మాజీ జేడీ కోరినట్టు … హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో జేడీ ప్రసంగించాడు. ఆ తర్వాత ప్రసంగించిన జయప్రకాశ్ నారాయణ వేదిక మీద నుంచే లోక్‌సత్తాలోకి రావాల్సిందిగా… వచ్చి నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా లక్ష్మీనారాయణను ఆహ్వానించారు.
ఆ సమయంలో మాజీ జేడీని పలువురు నేతలు అభినందించి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మైక్ అందుకున్న లక్ష్మీనారాయణ… లోక్‌సత్తా నేతలను కంగుతినిపించారట. ఇప్పుడే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని… సొంతంగా పార్టీ పెడుతానంటూ ప్రకటించారు. పలు పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు ఉన్నాయంటూ చెప్పారు. దీంతో లోక్‌సత్తా నాయకులు నిర్ఘాంతపోయారు.
జేపీ వద్దకు మూడు సార్లు వచ్చి లోక్‌సత్తాలో చేరుతానంటూ చెప్పిన లక్ష్మీనారాయణ…. కార్యక్రమ వేదికగా తనను పార్టీలోకి జేపీ స్వయంగా ఆహ్వానించాలని ముందే కోరిన లక్ష్మీనారాయణ… తీరా తనకు ఇతర పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయంటూ అప్పుడు చెప్పటం ఏమిటని లోక్‌సత్తా నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Publiée par Suresh Vmrg sur Lundi 26 novembre 2018