Telugu Global
Others

నాయకత్వంపై లోక్‌సత్తా నేత ఘాటు వ్యాఖ్యలు

లోక్‌సత్తా నాయకత్వంపై సొంత పార్టీ నేతలే  ఆరోపణలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా   ఆ పార్టీ సోషల్ మీడియా ప్రమోషన్‌ను పర్యవేక్షిస్తున్న నేత….  సోషల్ మీడియా ద్వారా  పార్టీ  విషయాలు చెప్పారు.  పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో చేరిన జయప్రకాశ్‌ నారాయణ… కమిటీలో చేయాల్సిన పనిచేయకుండా చంద్రబాబు ప్రభుత్వానికి వంతపాడారని ఆరోపించారు. చంద్రబాబును ఇబ్బందిపెట్టేలా మాట్లాడిన ఉండవల్లి లాంటి వారిని కూడా చులకన చేస్తూ జేపీ మాట్లాడారని లోక్‌సత్తా నాయకుడు వివరించారు. ఆ మధ్య స్వరాజ్య యాత్ర ప్రారంభించిన […]

లోక్‌సత్తా నాయకత్వంపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఆ పార్టీ సోషల్ మీడియా ప్రమోషన్‌ను పర్యవేక్షిస్తున్న నేత…. సోషల్ మీడియా ద్వారా పార్టీ విషయాలు చెప్పారు.

పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో చేరిన జయప్రకాశ్‌ నారాయణ… కమిటీలో చేయాల్సిన పనిచేయకుండా చంద్రబాబు ప్రభుత్వానికి వంతపాడారని ఆరోపించారు.

చంద్రబాబును ఇబ్బందిపెట్టేలా మాట్లాడిన ఉండవల్లి లాంటి వారిని కూడా చులకన చేస్తూ జేపీ మాట్లాడారని లోక్‌సత్తా నాయకుడు వివరించారు. ఆ మధ్య స్వరాజ్య యాత్ర ప్రారంభించిన సమయంలో…. జయప్రకాశ్‌ నారాయణను టీడీపీ రాజ్యసభకు పంపబోతోందని… కాబట్టి ఇకపై దయచేసి సోషల్ మీడియాలో టీడీపీపై అటాక్ చేయవద్దని తమకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే వారు ఎవరొచ్చినా కనీసం కలిసేందుకు కూడా జేపీ ఇష్టపడరని చెప్పారు.

2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసేందుకు జేపీ ప్రయత్నించారని.. అందులో భాగంగా మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని జేపీ ఆశించారన్నారు. కానీ అందుకు టీడీపీ అంగీకరించకపోవడంతో కూటమి నుంచి బయటకు వచ్చారన్నారు. కేవలం తనకు ఎంపీ టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో టీడీపీ- బీజేపీ కూటమి నుంచి జేపీ బయటకు రావడాన్ని పార్టీ మీటింగ్‌లో చాలా మంది నేతలు ప్రశ్నించారన్నారు. మీ స్వార్థం కోసం పార్టీని నడుపుతున్నారని జేపీని పలువురు నిలదీశారన్నారు.

లోక్‌సత్తా పార్టీలో ఏ ఒక్కరికి మంచిపేరు వస్తోందని తెలిసినా జయప్రకాశ్‌ నారాయణ జీర్ణించుకోలేరని సోషల్ మీడియాలో వివరించారు.

సంగీత దర్శకుడు కీరవాణి భార్య వల్లి కూకట్‌పల్లిలో లోక్‌సత్తా తరపున చురుగ్గా పనిచేస్తూ అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్నారని… దాన్ని చూసి ఓర్వలేకపోయిన ఆమెను మరో నియోజకవర్గానికి నాయకత్వం వెళ్లాల్సిందిగా ఆదేశించారన్నారు. దాంతో ఆమె లోక్‌సత్తా కార్యక్రమాలను వదిలేసి తన పని తాను చూసుకుంటున్నారని వివరించారు.

ఏపీలో బీసీ, ఎస్సీ ఎస్టీలకు సరైన నాయకత్వం లేదని వారి సమస్యలపై పోరాటం చేయాల్సిందిగా పార్టీ నేతలు నాయకత్వానికి సూచిస్తే… బీసీఎస్సీఎస్టీలకు నాయకత్వ లక్షణాలు లేవంటూ చులకనగా మాట్లాడారని వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో దళితులపై దాడి జరిగితే దాన్ని ఖండించేందుకు కూడా నాయకత్వం ఇష్టపడలేదన్నారు.

First Published:  27 Nov 2018 4:45 AM IST
Next Story