Telugu Global
NEWS

18 ఏళ్లకే ఆశ్రమం పెట్టి.... కోట్ల ఆస్తులకు పడగలెత్తి....

కర్నూలు బాల సాయిబాబా కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. దోమలగూడలోని ఆశ్రమంలో గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. 58 ఏళ్ల బాల సాయిబాబా ప్రయాణం ఎన్నో వివాదాల మధ్య సాగింది. ఎంతో మంది భక్తులను సంపాదించుకున్నారు. విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పుట్టపర్తి సాయిబాబా అంత కాకపోయినా బాల సాయిబాబా కూడా అదే తరహాలో పేరుగాంచేందుకు ప్రయత్నించారు. బాలసాయి బాబా 1960లో కర్నూలులో జన్మించారు. 18 […]

18 ఏళ్లకే ఆశ్రమం పెట్టి.... కోట్ల ఆస్తులకు పడగలెత్తి....
X

కర్నూలు బాల సాయిబాబా కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. దోమలగూడలోని ఆశ్రమంలో గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. 58 ఏళ్ల బాల సాయిబాబా ప్రయాణం ఎన్నో వివాదాల మధ్య సాగింది.

ఎంతో మంది భక్తులను సంపాదించుకున్నారు. విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పుట్టపర్తి సాయిబాబా అంత కాకపోయినా బాల సాయిబాబా కూడా అదే తరహాలో పేరుగాంచేందుకు ప్రయత్నించారు. బాలసాయి బాబా 1960లో కర్నూలులో జన్మించారు. 18 ఏళ్లకే ఆయన బాబాగా మారి ఆశ్రమం స్థాపించారు. నోటిలో నుంచి శివలింగాలను తీయడం, గాలిలోని నుంచి విభూది, ఉంగరాలు తీయడం వంటి మ్యాజిక్‌లతో ప్రారంభంలో భక్తులను ఆకట్టుకున్నారు.

తత్వశాస్త్రం మీద, వైద్యం మీద గొప్ప అవగాహన ఉందని చెప్పుకునే బాలసాయి పదో తరగతితోనే విద్యాభ్యాసం ఆపేశారని అంటారు. బాలసాయిబాబాకు డ్యాన్స్‌లో మంచి పట్టుందని, కొంత కాలం డ్యాన్స్‌ మాస్టార్‌గా విద్యార్ధులకు డ్యాన్స్‌ నేర్పించాడని చెబుతుంటారు.

ఈ బాబా చూట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. కర్నూలు ఆశ్రమం వద్ద భూ తగాద నడించింది. చెక్‌ బౌన్స్‌ కేసులు ఆయనపై నమోదయ్యాయి. తనను తాను మానవాతీతుడిగా ఆయన భావించేవారు. బండరాయిగా ఉండే వెంకటేశ్వరస్వామి ఎక్కువా? ఎప్పటికప్పుడు కోరికలు తీర్చే నేను ఎక్కువా చెప్పండి అని ఎదురు ప్రశ్నించేవారు.

వేల కోట్ల ఆస్తులపై ప్రశ్నించిన సమయంలో తనకు లక్ష రూపాయలను కూడా లెక్క పెట్టడం రాదని చెప్పేవారు. పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా అన్న ప్రశ్నకు… తాను పురుషుడినా, స్త్రీనా అంటూ అసలు పెళ్లంటూ ఒకటి ఉంటుందా అని కూడా తెలీదు అని చెప్పేవారు. ఆయనకు ఆశ్రమాలు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రజలుచెబుతుంటారు. ఇప్పుడు బాలసాయిబాబా చనిపోవడంతో ఆశ్రమాలు, ఆస్తులు ఏమవుతాయో చూడాలి.

First Published:  27 Nov 2018 7:42 AM IST
Next Story