Telugu Global
NEWS

చంద్రబాబుపై ప్రకాశ్‌ రాజ్‌ ఫైర్

తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు నటుడు ప్రకాశ్‌ రాజ్. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా చంద్రబాబు ఏమైనా ఇక్కడ ముఖ్యమంత్రి కాగలరా అని నిలదీశారు. 13 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న టీడీపీ తెలంగాణకు ఏం చేయగలదని నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏదైనా సమస్య తలెత్తితే చంద్రబాబు ఎటు నిలబడుతారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఏపీని చూసుకుంటే చాలని సలహా ఇచ్చారు. ఏపీలో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తామంటే చంద్రబాబు […]

చంద్రబాబుపై ప్రకాశ్‌ రాజ్‌ ఫైర్
X

తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు నటుడు ప్రకాశ్‌ రాజ్. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా చంద్రబాబు ఏమైనా ఇక్కడ ముఖ్యమంత్రి కాగలరా అని నిలదీశారు.

13 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న టీడీపీ తెలంగాణకు ఏం చేయగలదని నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏదైనా సమస్య తలెత్తితే చంద్రబాబు ఎటు నిలబడుతారని ప్రశ్నించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఏపీని చూసుకుంటే చాలని సలహా ఇచ్చారు. ఏపీలో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తామంటే చంద్రబాబు ఊరుకుంటారా అని వ్యాఖ్యానించారు.

కర్నాటకలో తాను కాంగ్రెస్‌ ను ఇష్టపడతానని…. అక్కడ కనీసం ఆ పార్టీకి సిద్దరామయ్య నాయకుడిగా ఉన్నారన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో నడిపించే నాయకుడెవరో ప్రజలకే తెలియడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకుంటుందని తాను అనుకోవడం లేదన్నారు. తానేమీ టీఆర్‌ఎస్ అభిమానిని కాదని…. అయినప్పటికీ నిజాలు మాట్లాడుతున్నానన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసి, అధికారంలోకి రావొచ్చని.. కాకపోతే మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణను పాలించే నాయకుడెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పట్లో వచ్చే ఆలోచన తనకు లేదన్నారు ప్రకాశ్‌ రాజ్‌.

First Published:  26 Nov 2018 4:45 AM IST
Next Story