Telugu Global
NEWS

ఈ మూడు సీట్లలో హేమాహేమీలు

గతంలో ఉపముఖ్యమంత్రి, మంత్రి పదవులు పొందిన నాయకులు ఉన్న నియోజక వర్గాలవి. ప్రతిష్టాత్మకమైన ఆ రెండు నియోజక వర్గాల్లో బరిలో హేమాహేమీలు పోటీ పడుతున్నారు. ఆ నియోజకవర్గాలు మరేవో కావు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాలు సభలు, సమావేశాలు, బలప్రదర్శనలతో మారిమోగిపొతున్నాయి. మంచిర్యాల నియోజక వర్గంలో టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్. దివాకర్ రావు బరిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ […]

ఈ మూడు సీట్లలో హేమాహేమీలు
X

గతంలో ఉపముఖ్యమంత్రి, మంత్రి పదవులు పొందిన నాయకులు ఉన్న నియోజక వర్గాలవి. ప్రతిష్టాత్మకమైన ఆ రెండు నియోజక వర్గాల్లో బరిలో హేమాహేమీలు పోటీ పడుతున్నారు. ఆ నియోజకవర్గాలు మరేవో కావు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాలు సభలు, సమావేశాలు, బలప్రదర్శనలతో మారిమోగిపొతున్నాయి.

మంచిర్యాల నియోజక వర్గంలో టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్. దివాకర్ రావు బరిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ బరిలో ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీబీ చైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ హేమాహేమీలుగా తలపడుతున్నారు.

గతంలో ఈ నియోజకవర్గం(లక్షెట్టిపేట)లో విజయం సాధించిన జేవీ నర్సింగరావు ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. జీవీ శ్రీనివాసరావు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం బరిలో నిలిచిన వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ గెలుపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.

చెన్నూరులో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన విద్యార్థి నేతగా ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత దగ్గర మనిషిగా పేరుంది. కాంగ్రెస్ నుంచి ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ బోర్లకుంట వెంకటేష్ బరిలో ఉన్నారు. ఆయన 18 సంవత్సరాలు సర్వీసు మిగిలి ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ బలబలాలను ప్రదర్శిస్తున్నారు.

గతంలో నాలుగు సార్లు విజయం సాధించిన కోదాటి రాజమల్లు, బోడ జనార్ధన్ లు మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం బెల్లంపల్లి నుంచి బీఎస్పీ తరుఫున బరిలోకి దిగిన గడ్డం వినోద్ ఇక్కడి నుంచి గెలిచి మంత్రిగా పని చేశారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన నల్లాల ఓదెలు ప్రభుత్వ విప్ గా కొనసాగారు.. మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామికి కూడా ఈ నియోజకవర్గం రాజకీయ భవిష్యత్ ఇచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకర్గం కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ప్రతిష్టాత్మకంగా మారింది.

బెల్లంపల్లి నుంచి నాలుగు సార్లు విజయం సాధించిన సీపీఐ శాసన సభ పక్షనేత గుండా మల్లేష్ మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ సీటు దక్కని మాజీ మంత్రి జీ.వినోద్ బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి తాజీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బరిలో నిలిచారు. బీజేపీ నుంచి ఆసిఫాబాద్ జడ్పీటీసీ, రాష్ట్ర జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ పోటీ చేస్తున్నాడు. మూడు దశాబ్దాలు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో పోరు హోరాహోరీగా కొనసాగుతుంది.

First Published:  25 Nov 2018 11:39 PM GMT
Next Story