Telugu Global
NEWS

ప్రధాన న్యాయమూర్తులను ఎందుకు ప్రశ్నించకూడదు? " జస్టిస్ చలమేశ్వర్

తమను ఎవరూ ప్రశ్నించకూడదన్నతత్వం ప్రధాన న్యాయమూర్తులకు తగదన్నారు రిటైర్డ్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్‌. ప్రధానులు, ముఖ్యమంత్రులను సాధారణ పౌరులు కూడా ప్రశ్నిస్తున్నప్పుడు… తమనెవరూ ప్రశ్నించకూడదని ప్రధాన న్యాయమూర్తులు భావించడం ఏంటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ప్రధాన న్యాయమూర్తులను ఎందుకు అతీతంగా చూడాలని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… సుప్రీం కోర్టులో కూడా జవాబుదారితనం ఉండాలన్నారు. అందుకోసం తాను గతంలో కొలీజియంను ప్రశ్నించానని చెప్పారు. న్యాయమూర్తుల నియామకంలో ఒక్క ప్రధాన […]

ప్రధాన న్యాయమూర్తులను ఎందుకు ప్రశ్నించకూడదు?  జస్టిస్ చలమేశ్వర్
X

తమను ఎవరూ ప్రశ్నించకూడదన్నతత్వం ప్రధాన న్యాయమూర్తులకు తగదన్నారు రిటైర్డ్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్‌.

ప్రధానులు, ముఖ్యమంత్రులను సాధారణ పౌరులు కూడా ప్రశ్నిస్తున్నప్పుడు… తమనెవరూ ప్రశ్నించకూడదని ప్రధాన న్యాయమూర్తులు భావించడం ఏంటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ప్రధాన న్యాయమూర్తులను ఎందుకు అతీతంగా చూడాలని ప్రశ్నించారు.

విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… సుప్రీం కోర్టులో కూడా జవాబుదారితనం ఉండాలన్నారు. అందుకోసం తాను గతంలో కొలీజియంను ప్రశ్నించానని చెప్పారు.

న్యాయమూర్తుల నియామకంలో ఒక్క ప్రధాన న్యాయమూర్తి మాత్రమే కాకుండా ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకోవడం కొద్దిమేరకు బెటర్‌ అని అభిప్రాయపడ్డారు. దేశంలో రోజుకో గాంధీ పుట్టుకురారని…. ప్రజలే బాధ్యతాయుతంగా ఎవరికి వారు మెలగాలని సూచించారు.

First Published:  25 Nov 2018 10:59 PM GMT
Next Story