కర్నాటక ట్రబుల్ షూటర్‌కు తెలంగాణలో ఏం పని?
డికె శివకుమార్. కర్నాటక జలవనరుల శాఖ మంత్రి. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్న కీలకనేత. జేడీఎస్‌తో కూటమి కట్టడంతో పాటు…. ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసిన నేత. కాంగ్రెస్‌లో మంచి వ్యూహకర్తగా పేరున్న నేత. ఈ కర్నాటక మంత్రి ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వారం రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు…. మరో 20 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గెలుపుకోసం దృష్టిపెట్టారు. బెంగళూరు నుంచి శివకుమార్ టీమ్…. తెలంగాణలో […]
డికె శివకుమార్. కర్నాటక జలవనరుల శాఖ మంత్రి. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్న కీలకనేత. జేడీఎస్‌తో కూటమి కట్టడంతో పాటు…. ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసిన నేత. కాంగ్రెస్‌లో మంచి వ్యూహకర్తగా పేరున్న నేత.
ఈ కర్నాటక మంత్రి ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వారం రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు…. మరో 20 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గెలుపుకోసం దృష్టిపెట్టారు.
బెంగళూరు నుంచి శివకుమార్ టీమ్…. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన నెంబర్‌పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతలను డీకేకు అప్పగించారని తెలుస్తోంది.
గుజరాత్ ఎన్నికల్లో అధికారం దగ్గర దాకా వచ్చి ఆగింది. కర్నాటకలో కళ్లముందే వేరే పార్టీకి అప్పగించాల్సి వచ్చింది. అయితే తెలంగాణలో మాత్రం ఆ పొరపాటు జరగకుండా చూడాలని కాంగ్రెస్ హైకమాండ్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ నేతలు అహ్మద్ పటేల్‌తో పాటు ఇతర కీలక నేతలు హైదరాబాద్‌లోనే మకాం వేశారు.
అహ్మద్ పటేల్‌ను రాజ్యసభకు పంపే క్రమంలో…బెంగళూరులో క్యాంపు రాజకీయాలను డీకే నడిపారు. అంతేకాదు కర్నాటక ఎమ్మెల్యేల క్యాంపులను డీకే నిర్వహించారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేందుకు కీలక సలహాలను డీకే టీమ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా రెబెల్స్ బెడద తగ్గించారని తెలుస్తోంది. తెలంగాణలో డీకే సలహాలు వర్క్‌వుట్ అయితాయో లేదో చూడాలి.