Telugu Global
National

అయోధ్య వివాదం.... బీజేపీని టార్గెట్ చేసిన శివసేన

హిందుత్వ వాదుల్లోనే చీలిక వచ్చింది. ఇదే అజెండాతో ముందుకెళ్తున్న బీజేపీకి శివసేన ఊహించని షాక్ ఇస్తోంది. అయోధ్య వివాదంలో తాజాగా బీజేపీని ఇరుకున పెట్టేలా శివసేన వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయోధ్యలో మోహరించిన శివసేన బీజేపీని ఇరుకున పెడుతోంది. రామమందిరం పనుల ప్రారంభ తేదీని బీజేపీ ప్రకటించాల్సిందేనని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా బీజేపీ, శివసేనల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఇదిలా కొనసాగుతుండగానే ఆదివారం ఆయన భార్య, కొడుకుతో కలిసి […]

అయోధ్య వివాదం.... బీజేపీని టార్గెట్ చేసిన శివసేన
X

హిందుత్వ వాదుల్లోనే చీలిక వచ్చింది. ఇదే అజెండాతో ముందుకెళ్తున్న బీజేపీకి శివసేన ఊహించని షాక్ ఇస్తోంది. అయోధ్య వివాదంలో తాజాగా బీజేపీని ఇరుకున పెట్టేలా శివసేన వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయోధ్యలో మోహరించిన శివసేన బీజేపీని ఇరుకున పెడుతోంది.

రామమందిరం పనుల ప్రారంభ తేదీని బీజేపీ ప్రకటించాల్సిందేనని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా బీజేపీ, శివసేనల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఇదిలా కొనసాగుతుండగానే ఆదివారం ఆయన భార్య, కొడుకుతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని రాంలల్లా ఆలయాన్ని సందర్శించారు. పుణే శివసేరి కోట నుంచి తెచ్చిన మట్టిని పూజారికి అందించారు.

బీజేపీపై శివసేన అధినేత ఉద్దవ్ థాకరే నిప్పులు చెరిగారు. రామ మందిర నిర్మాణంపై బీజేపీ నిద్రపోయినట్టు నటిస్తుందని, రామ మందిరంపై ఆర్డినెన్స్ కు ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందని…. బీజేపీ ఆర్డినెన్స్ తెస్తే శివసేన మద్దతిస్తదని తేల్చి చెప్పారు. రామమందిరం చుట్టూ అంతమంది పోలీసులను చూస్తే బాధగా అనిపిస్తోందన్నారు.

అర్డినెన్స్ తేవడానికి అఢ్డంకులు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. అయోధ్యలో ఆలయాన్ని కట్టడానికి ఇంకా ఎన్నేళ్లు తీసుకుంటారన్నారు. అయోధ్యను అందరూ ఎన్నికల అస్ర్తంగా వాడుకుంటున్నారని అన్నారు. అయోధ్య పర్యటన వెనుక ఎలాంటి రహస్య అజెండా లేదని చెప్పారు.

యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తో విశ్వహిందూ పరిషత్, శివసేనలు ధర్మసభలకు పిలుపునిచ్చాయి. ఆదివారం సభ నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

వీహెచ్ పీ సభ నేపథ్యంలో సభ కోసం పెద్ద సంఖ్యలో రామభక్తులు అయోధ్యకు బయలుదేరారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. 700మంది పోలీసులు, 42 కంపెనీల పీఏసీ బలగాలు, 5 కంపెనీల ఆర్ఏఎఫ్, ఏటీఎస్ కమాండోలను మోహరించారు. దీంతో మరోమారు అయోధ్య రామమందిర అంశం రాజకీయాలను వేడెక్కిస్తోంది.

First Published:  25 Nov 2018 4:00 AM GMT
Next Story