భారత మహిళా క్రికెట్లో ముసలం
ప్రపంచకప్ సెమీస్ ఓటమితో లుకలుకలు మిథాలీని పక్కనపెట్టడం పై విమర్శల వెల్లువ సీనియర్లు, జూనియర్లకు మధ్య పెరిగిన అంతరం భారత మహిళా క్రికెట్లో ముసలం రాజుకొంది. ఇంతకాలం మీడియా దృష్టికి దూరంగా ఉంటూ వచ్చిన మహిళా క్రికెట్లోని లుకలుకలు కాస్త…కరీబీయన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ సెమీస్ లోనే ఓటమితో బయటకు వచ్చాయి. మిథాలీ స్ట్రయిక్ రేట్ బ్యాడ్ బ్యాడ్… మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ మిథాలీరాజ్ నిలకడగా రాణిస్తున్నా….ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో రౌండ్, ఇంగ్లండ్ తో […]
- ప్రపంచకప్ సెమీస్ ఓటమితో లుకలుకలు
- మిథాలీని పక్కనపెట్టడం పై విమర్శల వెల్లువ
- సీనియర్లు, జూనియర్లకు మధ్య పెరిగిన అంతరం
భారత మహిళా క్రికెట్లో ముసలం రాజుకొంది. ఇంతకాలం మీడియా దృష్టికి దూరంగా ఉంటూ వచ్చిన మహిళా క్రికెట్లోని లుకలుకలు కాస్త…కరీబీయన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ సెమీస్ లోనే ఓటమితో బయటకు వచ్చాయి.
మిథాలీ స్ట్రయిక్ రేట్ బ్యాడ్ బ్యాడ్…
మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ మిథాలీరాజ్ నిలకడగా రాణిస్తున్నా….ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో రౌండ్, ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ లకు పక్కన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాలుగుజట్ల గ్రూప్ లీగ్ లో…రెండోర్యాంకర్ న్యూజిలాండ్, 7వ ర్యాంకర్ పాకిస్థాన్, 10వ ర్యాంకర్ ఐర్లాండ్, టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్లను అలవోకగా ఓడించిన భారత్…3వ ర్యాంకర్ ఇంగ్లండ్ తో ముగిసిన నాకౌట్ ఫైట్ లో మాత్రం 8 వికెట్ల తేడాతో చిత్తు గా ఓడి…ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అపారఅనుభవం ఉన్న సీనియర్ స్టార్ మిథాలీ లేకుండా భారతజట్టు సెమీస్ బరిలోకి దిగి భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది. మిథాలీ ఉండి ఉంటే…సెమీస్ కథ వేరేవిధంగా ఉండేదని విమర్శకులు అంటున్నారు.
హర్మన్ ప్రీత్ పై విమర్శలు…
అయితే…కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం…జట్టు ప్రయోజనాల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకొన్నామని…మిథాలీ లాంటి సీనియర్ ప్లేయర్ బంతికో పరుగు సాధించడం…జట్టుకు ఏవిధంగానూ మేలు చేయటంలేదని…స్ట్రయిక్ రేట్ సైతం అంతంత మాత్రమేనంటూ వివరణ ఇచ్చింది. పైగా..మిథాలీ లేకుండా ఆడాలన్న నిర్ణయం పట్ల తాను ఏమాత్రం చింతిచడం లేదని తేల్చి చెప్పింది.
మరోవైపు మిథాలీ మేనేజర్ అనీషా గుప్త మాత్రం కెప్టెన్ హర్మన్ ప్రీత్ పై విమర్శల వర్షం కురిపించింది.
మిథాలీని తుదిజట్టుకు దూరంగా ఉంచని హర్మన్ ప్రీత్ కు కెప్టెన్ గా ఉండే అర్హత లేదని…మిథాలీ పై ద్వేషంతోనే ఇలా చేశారని ఆరోపించింది. మిథాలీ ఉండిఉంటే…ఫలితం వేరే విధంగా ఉండేదని తేల్చి చెప్పింది.
సెలెక్షన్ కమిటీ వివరణ…
సెమీఫైనల్ మ్యాచ్ లో మిథాలీ ని ఆడించకుండా…విన్నింగ్ కాంబినేషన్ ను కొనసాగించాలన్నది సెలెక్షన్ కమిటీ నిర్ణయమని…భారత మహిళా క్రికెట్ జట్టు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.
తుదిజట్టు ఎంపిక సమయంలో….కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంథానా, చీఫ్ కోచ్ రమేశ్ పొవార్, సెలెక్టర్ సుధాషా ఉన్నారని…వీరంతా కలసి జట్టును ఖరారు చేసినట్లు వివరణ ఇచ్చింది.
23 పరుగుల తేడాతో 7 వికెట్లు టపటపా….
ఇంగ్లండ్ తో ముగిసిన సెమీఫైనల్లో…భారతజట్టు చివరి ఏడు వికెట్లు 23 పరుగుల తేడాతో నష్టపోయి…పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ కావడం పట్ల మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి మండిపడుతోంది. మిథాలీ రాజ్ కు జరిగిన అవమానం సహించరానిదంటూ దుయ్యబట్టింది.
బీసీసీఐ నుంచి తగినంతగా ప్రోత్సాహం, నిధులు అందుకొంటున్న సమయంలో భారత మహిళా క్రికెట్లోని అభిప్రాయ భేదాలు బయటపడటం…ఏమంత మంచిదికాదని…క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, రెండోర్యాంకర్ న్యూజిలాండ్ లాంటి మేటిజట్లను చిత్తు చేసిన 5వ ర్యాంకర్ భారత్..చివరకు 3వ ర్యాంకర్ ఇంగ్లండ్ ముందు చేతులెత్తేయడం….అభిమానులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.
గెలుపు, ఓటమి క్రికెట్లో…అదీ టీ-20 ఫార్మాట్లో సహజమని సరిపెట్టుకోక తప్పదు.