Telugu Global
NEWS

టీమిండియాకు డూ ఆర్ డై

టీ-20 సిరీస్ లో నేడే ఆఖరాట సిడ్నీ వేదికగా సూపర్ సండే ఫైట్ మధ్యాహ్నం 1-30 నుంచి ఆఖరిపోరాటం టీమిండియా – ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది.  మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్… వానదెబ్బతో రద్దుల పద్దులో చేరడంతో…సిడ్నీ వేదికగా జరిగే సూపర్ సండే ఆఖరి టీ-20 మ్యాచ్…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు డూ ఆర్ డై గా మారింది.  సిరీస్ లో సమఉజ్జీగా నిలవాలంటే…ఈ మ్యాచ్ లో విరాట్ అండ్ […]

టీమిండియాకు డూ ఆర్ డై
X
  • టీ-20 సిరీస్ లో నేడే ఆఖరాట
  • సిడ్నీ వేదికగా సూపర్ సండే ఫైట్
  • మధ్యాహ్నం 1-30 నుంచి ఆఖరిపోరాటం

టీమిండియా – ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్… వానదెబ్బతో రద్దుల పద్దులో చేరడంతో…సిడ్నీ వేదికగా జరిగే సూపర్ సండే ఆఖరి టీ-20 మ్యాచ్…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు డూ ఆర్ డై గా మారింది.

సిరీస్ లో సమఉజ్జీగా నిలవాలంటే…ఈ మ్యాచ్ లో విరాట్ అండ్ కో నెగ్గి తీరాల్సి ఉంది. బ్రిస్బేన్ లో ముగిసిన తొలి టీ-20లో..డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా 4 పరుగులతో నెగ్గిన కంగారూ టీమ్ 1-0 ఆధిక్యంతో ఉంది. సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఆఖరి టీ-20 మ్యాచ్…ఆదివారం మధ్యహ్నాం 1-30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో ర్యాంకర్ టీమిండియా…ఒకటి లేదా రెండుమార్పులతో బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు.

కంగారూ తురుపుముక్క స్టార్క్…

టీ-20 సిరీస్ లో ఇప్పటికే అనూహ్యంగా 1-0తో పైచేయి సాధించిన ఆతిథ్య కంగారూ టీమ్…ఆఖరి మ్యాచ్ లో…మెరుపు ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ ను తురుపుముక్కగా ప్రయోగించబోతోంది. స్టార్క్ కు తుదిజట్టులో చోటు కల్పించడం ద్వారా…విరాట్ సేనకు సవాలు విసిరింది.

టీమిండియాదే పైచేయి….

మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ-20 మ్యాచ్ వానదెబ్బతో రద్దుల పద్దులో చేరే సమయానికి…ఆసీస్ తో ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో …2వ ర్యాంకర్ టీమిండియాదే పైచేయిగా ఉంది.

ఇప్పటి వరకూ ఆడిన 17 మ్యాచ్ ల్లో టీమిండియా 10 విజయాలు, ఆస్ట్రేలియా 6 విజయాల రికార్డుతో ఉన్నాయి. ఓ మ్యాచ్ రద్దయ్యింది.

కంగారూ గడ్డపై….

ఆస్ట్రేలియా వేదికగా…ఇప్పటి వరకూ టీమిండియా ఆడిన.. ఎనిమిది మ్యాచ్ ల్లో 4 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో ఉంది. సిడ్నీ వేదికగా ఈరోజు జరిగే ఆఖరి టీ-20 మ్యాచ్ లో నెగ్గడం ద్వారా…సిరీస్ ను 1-1తో సమం చేయటం ద్వారా రికార్డు మెరుగుపరచుకోవాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  25 Nov 2018 2:30 AM IST
Next Story