Telugu Global
NEWS

బాబుకు మళ్లీ శీలపరీక్ష.... వాకాటి రెడ్డి, దీపక్‌ రెడ్డేనా.... చౌదరి పైనా వేటుంటుందా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని సందర్భంలో తాను నిజాయితీ పరుడిని, నిప్పులాంటి వాడిని అని నిరూపించుకునేందుకు వచ్చే అవకాశాలను వెంటనే సద్వినియోగం చేసుకుంటుంటారు. కానీ అంతలోనే చంద్రబాబు నిప్పుతనాన్ని వెక్కిరించే పరిణామం ఎదురై ఆయన్ను ఇబ్బంది పెడుతుంటుంది. గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి బ్యాంకులను ముంచారు. రుణాలు తీసుకుని తిరిగి కట్టకుండా ఎగ్గొట్టారు. దాంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. వెంటనే చంద్రబాబు అవినీతిపరులను సహించేది లేదంటూ పార్టీ నుంచి […]

బాబుకు మళ్లీ శీలపరీక్ష.... వాకాటి రెడ్డి, దీపక్‌ రెడ్డేనా.... చౌదరి పైనా వేటుంటుందా?
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని సందర్భంలో తాను నిజాయితీ పరుడిని, నిప్పులాంటి వాడిని అని నిరూపించుకునేందుకు వచ్చే అవకాశాలను వెంటనే సద్వినియోగం చేసుకుంటుంటారు. కానీ అంతలోనే చంద్రబాబు నిప్పుతనాన్ని వెక్కిరించే పరిణామం ఎదురై ఆయన్ను ఇబ్బంది పెడుతుంటుంది.

గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి బ్యాంకులను ముంచారు. రుణాలు తీసుకుని తిరిగి కట్టకుండా ఎగ్గొట్టారు. దాంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. వెంటనే చంద్రబాబు అవినీతిపరులను సహించేది లేదంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అంతలోనే నెల్లూరు జిల్లాకే చెందిన టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు … మహారాష్ట్ర విదర్భలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. దానిపై మహారాష్ట్ర ఏసీబీ కేసులు నమోదు చేసింది. అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. కానీ అప్పుడు మాత్రం చంద్రబాబు సదరు టీడీపీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం గానీ… కనీసం మందలించడం కానీ చేయలేదు.

ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి హైదరాబాద్‌లో భూకజ్జా కేసులో ఇరుకున్నారు. వెంటనే ఆ రెడ్డిని కూడా చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాకాటి నారాయణరెడ్డి, దీపక్‌ రెడ్డి వీళ్ళు చేసిన మోసాలు… సుజనాచౌదరి చేసిన ఆరు వేల కోట్లతో పోలిస్తే చాలా తక్కువే.

అందులోనూ సుజనా చౌదరి బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్లు అప్పు తీసుకుని ఆ డబ్బును బోగస్‌ కంపెనీల సాయంతో ఆనవాళ్లు లేకుండా మాయం చేశారు. ఇప్పుడు బ్యాంకులు వేలం వేద్దామన్నా ఆస్తులు కనిపించని విధంగా బిగ్‌బాస్ కనుసన్నల్లో సుజనా చౌదరి నాకేశారు. దీంతో ఈడీ కేసులు నమోదు చేసింది.

ఆరు వేల కోట్లకు బ్యాంకులను సుజనా చౌదరి ముంచేశారని… ఏకంగా అధికారిక ప్రకటనను ఈడీ విడుదల చేసింది. వాకాటిరెడ్డి, దీపక్‌ రెడ్డిపై చర్యలు తీసుకున్న చంద్రబాబు తిమింగలం లాంటి సుజనా పైనా చర్యలు తీసుకుంటారా? కనీసం స్పందిస్తారా? లేదంటే … ఈడీ టార్గెట్ చేసింది సుజనా చౌదరిని కాబట్టి ఇదంతా కుట్ర అంటూ కట్టుకథలు ప్రచారం చేయిస్తారా అన్నది చూడాలి.

ఏది ఏమైనా చంద్రబాబు నిప్పుతనానికి సుజనా చౌదరి మరోసారి పరీక్ష తీసుకొచ్చారనే చెప్పాలి.

First Published:  25 Nov 2018 5:10 AM IST
Next Story