Telugu Global
NEWS

అరెస్టుకు రంగం సిద్దం?.... సమన్లు జారీ చేసిన ఈడీ

చంద్రబాబుకు బినామీగా పేరున్న సుజనా చౌదరిపై ఈడీ విరుచుకుపడుతోంది. ఇప్పటికే దాడులు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, ఆరు లగ్జరీ కార్లును సీజ్‌ చేసిన ఈడీ…. సుజనా చౌదరి ఆరు వేల కోట్లకు బ్యాంకులను ముంచారని అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో తదుపరి చర్యలకు వేగంగా పావులు కదుపుతోంది. విజయమాల్యా, నీరవ్‌ మోడీ తరహాలో దేశం విడిచి పారిపోకుండా సుజనా చౌదరి పై లుకౌట్‌ నోటీసులను ఈడీ జారీ చేసింది. ఆ వెంటనే సుజనా చౌదరికి ఈడీ సమన్లు […]

అరెస్టుకు రంగం సిద్దం?.... సమన్లు జారీ చేసిన ఈడీ
X

చంద్రబాబుకు బినామీగా పేరున్న సుజనా చౌదరిపై ఈడీ విరుచుకుపడుతోంది. ఇప్పటికే దాడులు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, ఆరు లగ్జరీ కార్లును సీజ్‌ చేసిన ఈడీ…. సుజనా చౌదరి ఆరు వేల కోట్లకు బ్యాంకులను ముంచారని అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో తదుపరి చర్యలకు వేగంగా పావులు కదుపుతోంది.

విజయమాల్యా, నీరవ్‌ మోడీ తరహాలో దేశం విడిచి పారిపోకుండా సుజనా చౌదరి పై లుకౌట్‌ నోటీసులను ఈడీ జారీ చేసింది. ఆ వెంటనే సుజనా చౌదరికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

సుజనా మోసం ఆరు వేల కోట్ల భారీ వ్యవహారం కావడం, నేరం చేసినట్టు పక్కా ఆధారాలు బయటకే కనిపిస్తుండడంతో…. సుజనా చౌదరి అరెస్ట్ ఖాయమని చెబుతున్నారు.

దాడుల్లో 120 బోగస్‌ కంపెనీలకు చెందిన స్టాంపులను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ ప్రకటించింది. డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లను స్వాదీనం చేసుకుంది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే సీబీఐ కేసులు నమోదు చేసింది.

జప్తు చేసిన కార్లలో ఫెరారీ, రేంజ్‌ రోవర్, బెంజ్‌, పోర్సే వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయని ఈడీ ప్రకటించింది. చంద్రబాబుకు ఆర్థిక బినామీగా ఉంటూ టీడీపీ తరపున ఢిల్లీలో చక్రం తిప్పిన సుజనా చౌదరిపై ఈడీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. టీడీపీ మీడియా కూడా హడావుడి చేయడం లేదు.

First Published:  24 Nov 2018 3:52 PM IST
Next Story