చంద్రబాబు పేరు కూడా ఉచ్చరించని సోనియా
కాంగ్రెస్ తరపున బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు రోజూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. చంద్రబాబు పనితీరుకు రాహుల్ గాంధీ కూడా చాలా ఆనందంగా ఉన్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబును జాతీయ నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మేడ్చల్‌లో జరిగిన సోనియా గాంధీ సభ టీడీపీ నేతల నోట్లో వెలక్కాయ పడ్డట్టు చేసింది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా గాంధీ, రాహుల్ నోట ఒక్కసారి […]
కాంగ్రెస్ తరపున బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు రోజూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. చంద్రబాబు పనితీరుకు రాహుల్ గాంధీ కూడా చాలా ఆనందంగా ఉన్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబును జాతీయ నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మేడ్చల్‌లో జరిగిన సోనియా గాంధీ సభ టీడీపీ నేతల నోట్లో వెలక్కాయ పడ్డట్టు చేసింది.
చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా గాంధీ, రాహుల్ నోట ఒక్కసారి కూడా చంద్రబాబు మాట రాలేదు. టీడీపీ పేరును ప్రస్తావించేందుకు కూడా వారు ఇష్టపడలేదు. కాంగ్రెస్ నేతలు కూడా అదే తరహాలో ప్రసంగాలు చేశారు.
చంద్రబాబుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ విపరీతమైన ప్రాధాన్యత ఇస్తోందని ఒకవైపు టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంటే సభలో సోనియా గాంధీ కనీసం చంద్రబాబు పేరును కూడా ఉచ్చరించేందుకు ఇష్టపడకపోవడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ ఎన్నికల ఖర్చు కోసం చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఉండవచ్చని… కానీ సభలో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తే పడే ఓట్లు కూడా పడవన్న భయంతో ఆయన పేరును కాంగ్రెస్ పెద్దలు ఉచ్చరించి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.