Telugu Global
Cinema & Entertainment

మళ్లీ కెలికిన వర్మ.... కావాల్సింది అదే!

కెలకడమే వర్మ ప్రవృత్తి. తిట్టుకోవడంలో అతడికి ఓ తుత్తి ఉంటుంది. అందుకే తనకు సంబంధం లేని విషయాల్ని కూడా కెలికి, సోషల్ మీడియాలో తిట్లు తింటుంటాడు ఈ సోకాల్డ్ దర్శకుడు. ఈసారి కూడా వర్మ ఓ సినిమాను, ఆ సినిమా దర్శకుడ్ని టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో తిట్టించుకుంటున్నాడు. ఇంతకీ వర్మ టార్గెట్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా. అతడే శంకర్. అతడు తీసిన సినిమా 2.0. ఆర్జీవీ విమర్శలు ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ చుట్టూ […]

మళ్లీ కెలికిన వర్మ.... కావాల్సింది అదే!
X

కెలకడమే వర్మ ప్రవృత్తి. తిట్టుకోవడంలో అతడికి ఓ తుత్తి ఉంటుంది. అందుకే తనకు సంబంధం లేని విషయాల్ని కూడా కెలికి, సోషల్ మీడియాలో తిట్లు తింటుంటాడు ఈ సోకాల్డ్ దర్శకుడు. ఈసారి కూడా వర్మ ఓ సినిమాను, ఆ సినిమా దర్శకుడ్ని టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో తిట్టించుకుంటున్నాడు.

ఇంతకీ వర్మ టార్గెట్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా. అతడే శంకర్. అతడు తీసిన సినిమా 2.0. ఆర్జీవీ విమర్శలు ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. దాదాపు వారం రోజులుగా 2.0 సినిమాపై, శంకర్ పై నానా కామెంట్స్ చేస్తున్న వర్మ, నిన్న రాత్రి కూడా అదే పని చేశాడు.

వర్మ సమర్పిస్తున్న భైరవగీత సినిమా 30న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన వర్మ.. ఓ పెద్ద దర్శకుడు చిన్న పిల్లల కోసం 2.0 అనే సినిమా చేశాడని, ఓ చిన్న దర్శకుడు పెద్దోళ్ల కోసం భైరవగీత అనే సినిమా తీశాడని వ్యాఖ్యానించాడు.

వర్మ వ్యాఖ్యల్ని నెటిజన్లు తిప్పికొడుతున్నారు. దమ్ముటే బాహుబలి, 2.0 లాంటి సినిమాలు తీసి నిరూపించుకోవాలని, చీప్ పబ్లిసిటీ కోసం 2.0 లాంటి పెద్ద సినిమాను విమర్శించడం తగదని గడ్డిపెడుతున్నారు.

First Published:  24 Nov 2018 10:37 AM IST
Next Story