సీనియార్టీ పెరిగినా రేటు తగ్గలేదు
సాధారణంగా హీరోలకు ఎంత సీనియారిటీ పెరిగితే అంత క్రేజ్. కానీ హీరోయిన్లకు మాత్రం సీనియారిటీ పెరిగిందంటే క్రేజ్ ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. సేమ్ టైం రెమ్యూనరేషన్ కూడా పడిపోతుంది. కానీ కాజల్ విషయంలో ఇది రివర్స్ అయింది. దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మకు ఇంకా క్రేజ్ ఉంది. అందుకే ఇప్పటికీ సినిమాకు కోటిన్నర పారితోషికాన్ని డిమాండ్ చేసి మరీ తీసుకుంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన కవచం అనే సినిమా చేస్తోంది కాజల్. […]

సాధారణంగా హీరోలకు ఎంత సీనియారిటీ పెరిగితే అంత క్రేజ్. కానీ హీరోయిన్లకు మాత్రం సీనియారిటీ పెరిగిందంటే క్రేజ్ ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. సేమ్ టైం రెమ్యూనరేషన్ కూడా పడిపోతుంది. కానీ కాజల్ విషయంలో ఇది రివర్స్ అయింది.
దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మకు ఇంకా క్రేజ్ ఉంది. అందుకే ఇప్పటికీ సినిమాకు కోటిన్నర పారితోషికాన్ని డిమాండ్ చేసి మరీ తీసుకుంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన కవచం అనే సినిమా చేస్తోంది కాజల్. ఈ సినిమాకు ఆమెకు కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారట.
ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్లయినా కాజల్ కు ఇంత డిమాండ్ ఉండడం నిజంగా గ్రేట్. కవచం సినిమాతో పాటు బెల్లంకొండ సరసన మరో సినిమాలో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ. అటు కోలీవుడ్ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇలా రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా గడిపేస్తోంది కాజల్.