ఎరువులు, పురుగు మందులు ఆపేసి.... వేదాలు వినిపించండి
సంగీతం వినిపిస్తే మొక్కలు త్వరగా ఎదుగుతాయని అప్పుడెప్పుడో విన్నాం. ఇప్పుడు పంటలకు ఎరువులు వేయడం, పురుగు మందులు కొట్టడం ఆపేసి పొలాలలోని పంటలకు రోజూ కనీసం 20 నిమిషాల చొప్పున 20 రోజుల పాటు వేదాలు చదివి వినిపిస్తే ఎరువులు వేయకుండానే పంటలు బాగా పెరుగుతాయని, పంటలను తినేసే పురుగులు మాయమవుతాయని గోవా ప్రభుత్వం అక్కడి రైతులకు బోధిస్తోందట. వేదాలను వినడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయని, పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని గోవా ప్రభుత్వం రైతులకు […]
సంగీతం వినిపిస్తే మొక్కలు త్వరగా ఎదుగుతాయని అప్పుడెప్పుడో విన్నాం. ఇప్పుడు పంటలకు ఎరువులు వేయడం, పురుగు మందులు కొట్టడం ఆపేసి పొలాలలోని పంటలకు రోజూ కనీసం 20 నిమిషాల చొప్పున 20 రోజుల పాటు వేదాలు చదివి వినిపిస్తే ఎరువులు వేయకుండానే పంటలు బాగా పెరుగుతాయని, పంటలను తినేసే పురుగులు మాయమవుతాయని గోవా ప్రభుత్వం అక్కడి రైతులకు బోధిస్తోందట.
వేదాలను వినడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయని, పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని గోవా ప్రభుత్వం రైతులకు చెబుతోందట.
అక్కడి వ్యవసాయ మంత్రి విజయ్ సర్థేశాయ్, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌లు ఇందుకు సంబంధించి పలు ఆధ్యాత్మిక సంస్థలను సంప్రదిస్తున్నారట. కొంతమంది ఆధ్యాత్మిక గురువులతో వ్యవసాయ అధికారులు సమావేశమై ఈ కాస్మిక్ ఫార్మింగ్ గురించి చర్చిస్తున్నారట.