దామోదర డుమ్మా.... భార్య ఎఫెక్టేనా?
కాంగ్రెస్- టీడీపీ కూటమి ప్రతిష్టాత్మకంగా మేడ్చల్‌లో సోనియా, రాహుల్‌ల సభను నిర్వహించింది. భారీగా జనసమీకరణ చేశారు. నేతలంతా హాజరయ్యారు. సోనియా, రాహుల్ కంట పడేందుకు పోటీ పడ్డారు. కానీ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ మాత్రం ఈ ప్రతిష్టాత్మక సభకు హాజరుకాలేదు. ఈ పరిణామం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. దామోదర భార్య ఆ మధ్య బీజేపీలో చేరి సాయంత్రానికి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అప్పటి నుంచే ఆయనకు కాంగ్రెస్‌లో పాధాన్యత తగ్గిందని […]
కాంగ్రెస్- టీడీపీ కూటమి ప్రతిష్టాత్మకంగా మేడ్చల్‌లో సోనియా, రాహుల్‌ల సభను నిర్వహించింది. భారీగా జనసమీకరణ చేశారు. నేతలంతా హాజరయ్యారు. సోనియా, రాహుల్ కంట పడేందుకు పోటీ పడ్డారు. కానీ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ మాత్రం ఈ ప్రతిష్టాత్మక సభకు హాజరుకాలేదు.
ఈ పరిణామం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. దామోదర భార్య ఆ మధ్య బీజేపీలో చేరి సాయంత్రానికి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అప్పటి నుంచే ఆయనకు కాంగ్రెస్‌లో పాధాన్యత తగ్గిందని చెబుతున్నారు.
సొంత భార్యను బీజేపీలోకి వెళ్లకుండా చూడలేకపోయారన్న నింద కూడా ఆయనపై పడింది. అప్పటి నుంచి దామోదరకు కాంగ్రెస్‌కు పట్టుదెబ్బతిందని చెబుతున్నారు. ఇప్పుడు నేరుగా సభకు వచ్చి సోనియా, రాహుల్ ముందు నిలబడేందుకు ఆయన ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటారని, అందుకే రాలేదని భావిస్తున్నారు.
మరికొందరు మాత్రం టికెట్ల కేటాయింపు, ఇతర అంశాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోడం వల్లే దామోదర రాజనర్సింహ … సోనియా సభకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు.