Telugu Global
NEWS

టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ లోనే ముగిసిన భారత్ పోటీ

ఇంగ్లండ్ తో రెండో సెమీస్ లో భారత్ బోల్తా అప్పుడు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో… ఇప్పుడు టీ-20 ప్రపంచకప్ సెమీస్ లో ఫైనల్లో ఐదోసారి ఆస్ట్రేలియా 2018 టీ-20 మహిళా ప్రపంచకప్ ఫైనల్ చేరాలన్న భారత్ ఆశలకు…సెమీస్ లోనే ఇంగ్లండ్ గండి కొట్టింది. ఆంటీగా సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్లతో.. భారత్ ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో టాస్ నెగ్గి … ముందుగా బ్యాటింగ్ […]

టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ లోనే ముగిసిన భారత్ పోటీ
X
  • ఇంగ్లండ్ తో రెండో సెమీస్ లో భారత్ బోల్తా
  • అప్పుడు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో… ఇప్పుడు టీ-20 ప్రపంచకప్ సెమీస్ లో
  • ఫైనల్లో ఐదోసారి ఆస్ట్రేలియా

2018 టీ-20 మహిళా ప్రపంచకప్ ఫైనల్ చేరాలన్న భారత్ ఆశలకు…సెమీస్ లోనే ఇంగ్లండ్ గండి కొట్టింది. ఆంటీగా సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్లతో.. భారత్ ను చిత్తు చేసింది.

ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో టాస్ నెగ్గి … ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ స్మృతి మంథానా 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.

టాపార్డర్ టపటపా….

భారత్ చివరి ఆరు వికెట్లు కేవలం 12 పరుగుల తేడాతో నష్టపోయింది. సమాధానంగా 113 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికే విజయం సొంతం చేసుకొంది.

అప్పుడు…. ఇప్పుడు….

వన్ డౌన్ జోన్స్ 53, రెండో డౌన్ షివియర్ 52 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించి…తమజట్టుకు 8 వికెట్ల విజయంతో…ఫైనల్ బెర్త్ ఖాయం చేశారు.

గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన భారత్…ఈసారి టీ-20 ప్రపంచకప్ సెమీస్ లో సైతం ఇంగ్లండ్ చేతిలోనే పరాజయం పొందటం విశేషం.

ఈనెల 24న జరిగే టైటిల్ ఫైట్ లో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో …3వ ర్యాంకర్ ఇంగ్లండ్ తలపడనుంది. గత ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ సెమీస్ లోనే నిష్క్రమించడం ఇది మూడోసారి.

ఫైనల్లో ఐదోసారి ఆస్ట్రేలియా….

టీ-20 మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ కు…మూడుసార్లు విజేత ఆస్ట్రేలియా వరుసగా ఐదోసారి చేరుకొంది.

సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి సెమీ ఫైనల్లో టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా…71 పరుగుల భారీ తేడాతో… డిఫెండింగ్ చాంపియన్ విండీస్ ను చిత్తు చేసింది.

ఈమ్యాచ్ లో టాస్ ఓడి… ముందుగా బ్యాటింగ్ కు దిగిన కంగారూ టీమ్..20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగుల స్కోరు సాధించింది.

ఓపెనర్ అలీసా హేలీ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సమాధానంగా ..143 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన విండీస్ టీమ్ 17.3 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది.

ఆసీస్ దెబ్బకు దెబ్బ….

ఈ విజయంతో కంగారూ టీమ్…గత ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి…కరీబియన్ టీమ్ పై బదులు తీర్చుకోగలిగింది. ఈనెల 24న జరిగే ప్రపంచకప్ టైటిల్ సమరంలో ఇంగ్లండ్ తో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  23 Nov 2018 11:25 AM IST
Next Story