Telugu Global
NEWS

ఎమ్మెల్సీ యాదవరెడ్డిని బహిష్కరించిన టీఆర్ఎస్‌

ఎమ్మెల్సీ యాదవరెడ్డిని టీఆర్‌ఎస్ బహిష్కరించింది. సోనియా పర్యటన సందర్బంగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారన్న పక్కా సమాచారంతో టీఆర్‌ఎస్ వేటు వేసింది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న యాదవ రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ పదవి ఆశించారు. అందు కోసం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. కానీ జెడ్పీ చైర్మన్ పదవి దక్కలేదు. అయితే కేసీఆర్‌ యాదవరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కొంతకాలంగా యాదవ రెడ్డి టీఆర్‌ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల […]

ఎమ్మెల్సీ యాదవరెడ్డిని బహిష్కరించిన టీఆర్ఎస్‌
X

ఎమ్మెల్సీ యాదవరెడ్డిని టీఆర్‌ఎస్ బహిష్కరించింది. సోనియా పర్యటన సందర్బంగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారన్న పక్కా సమాచారంతో టీఆర్‌ఎస్ వేటు వేసింది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న యాదవ రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ పదవి ఆశించారు.

అందు కోసం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. కానీ జెడ్పీ చైర్మన్ పదవి దక్కలేదు. అయితే కేసీఆర్‌ యాదవరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కొంతకాలంగా యాదవ రెడ్డి టీఆర్‌ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో పాటు యాదవరెడ్డి కూడా పార్టీ వీడుతారని ప్రచారం సాగింది.

ఈ నేపథ్యంలోనే నేడు మేడ్చల్‌లో జరగనున్న సోనియా గాంధీ బహిరంగసభలో యాదవ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం నిర్ధారణ కావడంతో టీఆర్‌ఎస్‌ యాదవ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది.

First Published:  23 Nov 2018 12:05 AM GMT
Next Story