Telugu Global
NEWS

టీడీపీ అభ్యర్ధి పై భూ కబ్జా, ఫోర్జరీ కేసులు నమోదు

సామా రంగారెడ్డి…. టీడీపీ నుంచి ఎల్‌బీ నగర్ టికెట్ ఆశించిన వ్యక్తి. కాని ఆది నుంచి అతనికి అన్నీ కష్టాలే. తనకు టికెట్ వస్తుందని ఆశించి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఎల్బీ నగర్‌లో ప్రచారం మొదలు పెట్టారు. టికెట్ రావడం కష్టమేమో అని భావించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట తన అనుచరులతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేశారు. అయినా సరే అతనికి టీడీపీ మొండి చెయ్యి చూపింది. మహాకూటమి పొత్తులో భాగంగా ఎల్బీ నగర్ […]

టీడీపీ అభ్యర్ధి పై భూ కబ్జా, ఫోర్జరీ కేసులు నమోదు
X

సామా రంగారెడ్డి…. టీడీపీ నుంచి ఎల్‌బీ నగర్ టికెట్ ఆశించిన వ్యక్తి. కాని ఆది నుంచి అతనికి అన్నీ కష్టాలే. తనకు టికెట్ వస్తుందని ఆశించి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఎల్బీ నగర్‌లో ప్రచారం మొదలు పెట్టారు. టికెట్ రావడం కష్టమేమో అని భావించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట తన అనుచరులతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేశారు. అయినా సరే అతనికి టీడీపీ మొండి చెయ్యి చూపింది. మహాకూటమి పొత్తులో భాగంగా ఎల్బీ నగర్ సీటు కాంగ్రెస్‌కు కేటాయించడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

కాని సామాకు ఇబ్రహీంపట్నం సీటును టీడీపీ కేటాయించింది. అక్కడ కాంగ్రెస్ కూడా మల్‌రెడ్డి రంగారెడ్డికి తొలుత బీఫాం ఇచ్చింది. కాని తర్వాత వాపస్ తీసుకోవడంతో మహాకూటమి తరపున సామా రంగారెడ్డి ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా నిలిచారు.

సామాకు మహాకూటమి అభ్యర్థిత్వం రావడంతో అక్కడ ప్రచారం ప్రారంభించారు. అయితే అనూహ్యంగా సామాపై ఒక ఫోర్జరీ కేసు ఇవాళ నమోదైంది. మాదాపూర్‌లో కోట్లాది రూపాయల విలువైన భూమిని సామా రంగారెడ్డి ఫోర్జరీ సంతకాలతో కాజేశారని ఒకాయన ఫిర్యాదు చేశారు. నాంపల్లి రిజిష్ట్రార్ కార్యాలయంలోనే ఈ ఫోర్జరీలు జరిగాయని స్పష్టమైన ఆధారాలతో సదరు వ్యక్తి పిర్యాదు చేయడంతో సామా రంగారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భూ కబ్జా, ఫోర్జరీ సంతకాలు తదితర నేరాలపై సెక్షన్ 420, 468, 471 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఇలా టికెట్ కోసం కష్టపడి ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ వచ్చిందన్న సంతోషం ఈ కేసుతో సామాలో ఎగిరిపోయింది. అయితే సామా నామినేషన్‌కి ఆమోదం తెలపడంతో ప్రస్తుతానికి అయితే అతనికి ఎలాంటి ఇబ్బందులు లేవనే చెప్పాలి.

First Published:  23 Nov 2018 11:57 AM IST
Next Story