కేసీఆర్ మొక్కను పీకేసిన దుండగులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్క (ప్రస్తుతం చెట్టు అయింది) ని దుండగులు పెకిలించివేశారు. మూడేళ్లలో మొక్క బాగా పెరిగి చెట్టు అయింది. హరితహారం తొలి విడతలో భాగంగా కేసీఆర్…. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కరకట్ట వద్ద మొక్కను నాటారు. మొక్క కోసం మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.మూడేళ్లలో ఆ మొక్క పెరిగి చెట్టు అయింది. చెట్టు అయింది కదా అని ఇంకేం ఇబ్బంది లేదనుకుంటున్న తరుణంలో దుండగులు రాత్రికి రాత్రి ఆ చెట్టును […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్క (ప్రస్తుతం చెట్టు అయింది) ని దుండగులు పెకిలించివేశారు. మూడేళ్లలో మొక్క బాగా పెరిగి చెట్టు అయింది. హరితహారం తొలి విడతలో భాగంగా కేసీఆర్…. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కరకట్ట వద్ద మొక్కను నాటారు.
మొక్క కోసం మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.మూడేళ్లలో ఆ మొక్క పెరిగి చెట్టు అయింది. చెట్టు అయింది కదా అని ఇంకేం ఇబ్బంది లేదనుకుంటున్న తరుణంలో దుండగులు రాత్రికి రాత్రి ఆ చెట్టును నేల కూల్చేశారు. ఉదయం చూసే సరికి నేలపై పడి ఉంది. ఆ పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ఒకటి ఉంచి వెళ్లారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చెట్టును పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ నాటిన మొక్కలకు ఇలాంటి ముప్పు ఉంటుందని ముందే ఊహించి కొన్నిచోట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయం వద్ద కేసీఆర్ మొక్క నాటారు. దాన్ని దుండగుల నుంచి కాపాడేందుకు పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టెంట్ వేసి ఒక పోలీసును కాపలాగా పెట్టారు.